Breaking News

ఈ సినిమాలు చూస్తే గజగజ వణకడమే! ఏది ఏ ఓటీటీలో ఉందంటే?

Published on Sun, 08/11/2024 - 13:45

చాలామందికి చీకటంటే భయం. కానీ హారర్ సినిమాలు చూడటానికి రెడీ. మరికొందరు అర్థరాత్రి ఒంటరిగా ఇలాంటి మూవీస్ చూడాలని కోరిక. అలాంటి వాళ్ల కోసమే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న 12 బెస్ట్ హారర్ మూవీస్ లిస్టుతో వచ్చేశాం. వీటిని చూస్తుంటే ఓవైపు థ్రిల్లింగ్ మరోవైపు భయం గ్యారంటీ. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఇవి ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయ్?

(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)

ఓటీటీల్లో బెస్ట్ హారర్ మూవీస్

  1. మణిచిత్ర తాళు (1993) - మనకు బాగా తెలిసిన 'చంద్రముఖి' చిత్రానికి ఇది ఒరిజినల్. మలయాళంలో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

  2. 13బీ (2009) - ఇదో డబ్బింగ్ సినిమా. ఓ ఇంట్లో జరిగిన వింత సంఘటనల ఆధారంగా తీశారు. హాట్‌స్టార్‌లో అది కూడా తెలుగులోనే ఉంది.

  3. అరుంధతి (2009) - స్వీటీ అనుష్క శెట్టి నటించిన తెలుగు హారర్ మూవీ ఇది. బొమ్మాళీ అని అప్పట్లో అందరినీ భయపెట్టింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

  4. భ్రమయుగం (2024) - తెలుగులో డబ్బింగ్ అయిన మలయాళ హారర్ మూవీ ఇది. కేవలం మూడు పాత్రలతో పాడుబడ్డ ఇంటిలో జరిగిన స్టోరీతో తీశారు. సోనీ లివ్ ఓటీటీలో ఉంది.

  5. పిజ్జా (2012) - విజయ్ సేతుపతికి స్టార్‌డమ్ తీసుకొచ్చిన సినిమా ఇది. పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఎదురైన వింత అనుభవాలే కథ. హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

  6. భూతకాలం (2022) - దెయ్యాన్ని ఏ మాత్రం చూపించకుండా భయపెట్టిన సినిమా ఇది. మలయాళ సినిమానే కానీ తెలుగు డబ్బింగ్ సోనీ‪‌లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

  7. మసూద (2022) - అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు సినిమా. ఆహా ఓటీటీలో ఉంది. చూస్తే ప్యాంట్ తడిసిపోవడం గ్యారంటీ.

  8. హౌస్ ఆఫ్ సీక్రెట్స్ (2021) - ఇది మూడు ఎపిసోడ్స్ ఉన్న డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ఇది. నిజ జీవిత సంఘటనలతో తీశారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే ఉంది.

  9. తుంబాడ్ (2018) - అత్యాశ మనిషిని ఎలా నాశనం చేస్తుందో అనే కాన్సెప్ట్‌కి హారర్ జోడించి తీసిన సినిమా ఇది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

  10. కౌన్ (1999) - రాంగోపాల్ వర్మ తీసిన హిందీ సినిమా ఇది. డిఫరెంట్ సౌండ్స్‌తో తీసిన ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లోనే ఉంది.

  11. గృహం (2017) - సిద్ధార్థ్ నటించిన ఈ సినిమా.. వెన్నులో వణుకు పుట్టేలా భయపెడుతుంది. జియో సినిమా ఓటీటీతో పాటు యూట్యూబ్‌లోనూ తెలుగులోనే అందుబాటులో ఉంది.

  12. డీమోంటే కాలనీ (2015) - బంగ్లాలో జరిగే కథతో తీసిన క్రేజీ థ్రిల్లర్ మూవీ. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనే ఉందండోయ్!

(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)