Breaking News

నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్‌కు ఊపిరి పోస్తాయా?

Published on Thu, 03/05/2026 - 23:49

తెలుగు రాష్ట్రాల్లో గత వారం నుంచి థియేటర్లు పెద్దగా సందడిగా కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చాలా థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్‌కు ఊపిరి పోయేలా ఈ శుక్రవారం ఒకేసారి దాదాపు 10 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా చిన్న చిత్రాలే ఉండటం విశేషం. పెద్దగా బజ్ లేకుండానే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో కొంతమేరకు ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం మృత్యుంజయ. హీరో శ్రీ విష్ణు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. గత వారం విష్ణు విన్యాసంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఈ వీకెండ్ మృత్యుంజయతో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఉంటుందని, ఇందులో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కంటే థ్రిల్లింగ్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు.

మరో చెప్పుకోదగ్గ సినిమా సరస్వతి. ఈ చిత్రాన్ని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ స్వయంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాదు ఈ సినిమాను ఆమెనే నిర్మించారు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాదవ్‌ కథ అందించారు. తమన్‌ సంగీతాన్ని సమకూర్చారు. కథ బలంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.

ఇవే కాకుండా సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని అనే చిత్రం కూడా ఈ వారం విడుదలవుతోంది. ఇందులో శివాజీ , లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మొదట ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

ఇవి కాకుండా కాన, మాన్షన్ హౌజ్ మల్లేష్, కాక్రోచ్, విధాత వంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్‌ నటించిన మున్నా సినిమాను రీ-రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నటి లావన్య త్రీపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి సినిమా మాత్రం చివరి నిమిషంలో వాయిదా పడింది. మొత్తానికి పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ ఒకేసారి పది సినిమాలు విడుదలవుతుండటంతో ఈ వారం బాక్సాఫీస్‌లో కొంత కదలిక కనిపిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ప్రేక్షకులు ఈ సినిమాలను ఎలా స్వీకరిస్తారో చూడాలి. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)