Weather: ఏపీకి భారీ వర్ష సూచన
Breaking News
ప్రభుత్వ ఖాతాలో రూ.21.33 కోట్లు జమ
Published on Wed, 08/23/2023 - 01:06
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నూతన మద్యం లైసెన్స్‌దారులు దుకాణాలకు సంబంధించి ఏడాది ఫీజులో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ 1/6 వంతు డబ్బులు ప్రభుత్వ ఖాతాలో జమ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 230 దుకాణాలకు సంబంధించి దుకాణాల ఫీజు రూ.21.22 కోట్లను మంగళవారం ప్రభుత్వ ఖాతాలో జమ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు స్లాబ్‌లు ఉన్నాయి. ఇందులో మహబూబ్‌నగర్ పట్టణంలో స్లాబ్ రూ.65 లక్షలు ఉంటే రూ.10 లక్షలు, నారాయణపేటలో స్లాబ్ రూ.55లక్షలు ఉంటే రూ.9.16 లక్షలు జమచేశారు. ప్రస్తుతం దుకాణాలు సొంతం చేసుకున్న లైసెన్స్‌దారులు డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం విక్రయాలు నిర్వహించనున్నారు.
ఓవర్సీస్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
స్టేషన్ మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్‌స్కాలర్‌షిప్ పథకానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ కోర్సులను విదేశాల్లో అభ్యసించడానికి ఉపకార వేతనం పొందేందుకు అర్హత గల మైనార్టీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రవీంద్రనాథ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. www.tela nganaepass. cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలో స్టడీ, కుల సర్టిఫికెట్లతో పాటు ఇతర సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు. దరఖాస్తు చేసిన హార్డ్‌కాపీలు, సర్టిఫికెట్లను జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో అందజేయాలని, వచ్చే నెల 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
‘ఆరోగ్య మహిళ’చికిత్సపై దృష్టి పెట్టాలి
పాలమూరు: ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద మహిళలకు నిర్వహించే పలు రకాల చికిత్సలపై ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా సక్రమంగా పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ అన్నారు. హన్వాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం డీఎంహెచ్‌ఓ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య మహిళ ఓపీ, రెఫరల్స్, టీ–హాబ్‌కు సేకరించి పంపిస్తున్నా శాంపిల్స్‌పై ఆరా తీశారు. దీంతో పాటు ఇతర ఓపీ వివరాలు, రికార్డులు పరిశీలించారు. ప్రధానంగా ఆరోగ్య మహిళ కింద చేస్తున్న అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అవసరం అయిన వారిని జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయాలన్నారు.
నేడు జిల్లాస్థాయి పీఈటీల సమావేశం
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాల ఆవరణలోని గాంధీహాల్‌లో జిల్లాస్థాయి వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి కె.రమేశ్‌బాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఉదయం పాఠశాలకు హాజరై మధ్యాహ్నం సమావేశంలో పాల్గొనాలని సూచించారు. సమావేశంలో మండల, జిల్లా, ఉమ్మడి జిల్లాల పాఠశాలల క్రీడల నిర్వహణ, తేదీలపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు హాజరుకావాలని కోరారు.
గ్రూప్–2 ఉచితకోచింగ్‌కు దరఖాస్తులు
స్టేషన్ మహబూబ్‌నగర్: రాష్ట్ర మైనార్టీ స్టడిసర్కిల్, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మైనార్టీ నిరుద్యోగ యువతకు 45 రోజుల పాటు గ్రూప్–2 ఉద్యోగాల కోసం (నాన్ రెసిడెన్షియల్) ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రవీంద్రనాథ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 28 లోగా దరఖాస్తులను జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. అర్హులు సద్విని యోగం చేసుకోవాలని, మిగతా వివరాల కోసం 79933 57089, 73827 13597, 90525 22696 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
Tags : 1