Breaking News

గుంట పొలం ఉన్నా రైతు బీమాకు అర్హత

Published on Thu, 07/27/2023 - 07:44

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ఒక్క గుంట పొలం ఉన్నా రూ.5లక్షలు రైతు బీమా పథకానికి అర్హులని, జిల్లాలో కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు బీమా కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్‌ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి గ్రామాలలో ఆయన పర్యటించి వానాకాలం పంటల సాగు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. కొత్త పాసు పుస్తకాలు వచ్చిన రైతులు, అలాగే పాత పాసు పుస్తకాలు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకునేందుకు వారికి ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సిన వారు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి కొత్తగా వచ్చిన భూమి పాస్‌ బుక్కు, రైతు ఆధార్‌ కార్డు, నామినీ ఆధార్‌ కార్డు, నామినీ బ్యాంకు పాసు బుక్కు, ఎల్‌ఐసీ రైతు బీమా దరఖాస్తు జిరాక్స్‌ కాపీలను సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కృష్ణకాంత్‌, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేష్‌

Videos

పల్లె పాటకు జాతీయ అవార్డు రావడం చాలా గొప్పగా ఉంది

సింగపూర్ టూర్ పై తండ్రి, కొడుకులను ఏకిపారేసిన గుడివాడ అమర్నాథ్

ధర్మస్థల మరణాల మిస్టరీ.. సిట్ దర్యాప్తులో సంచలనం

చెప్పు తెగుద్ది.. యువకులకు వార్నింగ్ ఇచ్చిన అనసూయ

లిక్కర్ కేసులో సిట్ కుట్ర బట్టబయలు.. నోట్ల కట్టల తారుమారు..?

Srusti Case: చైల్డ్ ట్రాఫికింగ్ పై అడిగిన ప్రశ్నలకు నోరుమెదపని డాక్టర్ నమ్రత

సింగపూర్ నుంచి సైలెంట్ గా ఇంటికి.. మొహం చాటేసిన చంద్రబాబు

రూ. 11 కోట్ల కథలో కొత్త ట్విస్ట్.. అడ్డంగా దొరికిపోయిన బాబు

ఉత్తమ తెలుగు జాతీయ చిత్రం.. సత్తా చాటిన మన సినిమాలు

ఓవల్ టెస్ట్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడు

Photos

+5

‘బేబీ’ మూవీ నేషనల్‌ అవార్డు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

బబ్లూ పృథ్వీరాజ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌.. 60 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గానే (ఫోటోలు)

+5

11 నెలలు నీటిలో ఒక్క నెల మాత్రమే బయట ఈ శివాలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

క్యాప్షన్ ఇస్తూ.. పెళ్లి కూతురు గెటప్‌లో నిహారిక (ఫోటోలు)

+5

‘బకాసుర రెస్టారెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : భిన్న సంస్కృతుల నృత్య సమ్మేళనం (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవారం పూజలు చేసిన సురేఖవాణి, సుప్రీత (ఫొటోలు)

+5

సన్నాఫ్‌ సర్దార్‌-2 ప్రీమియర్‌ షో.. సందడి చేసిన తారలు (ఫొటోలు)

+5

మృణాల్‌ ఠాకూర్‌ బర్త్‌డే స్పెషల్‌.. రెమ్యునరేషన్‌తో తెలివైన నిర్ణయం (ఫోటోలు)

+5

రవీంద్ర భారతిలో ఆకట్టుకున్న బోనాల నృత్య రూపకం (ఫొటోలు)