Breaking News

మొన్న టెక్కీ అతుల్‌.. ఇప్పుడు పోలీస్‌ తిప్పణ్ణ

Published on Sun, 12/15/2024 - 10:32

కృష్ణరాజపురం: నా భార్య, ఆమె కుటుంబీకుల వేధింపులను భరించలేను. అన్ని విధాలా వేధించి నరకం చూపుతున్నారు. నాకు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, డొనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ న్యాయం చేయాలని వేడుకుంటూ అతుల్‌ సుభాష్‌ అనే టెక్కీ బెంగళూరులో ఉరివేసుకోవడం దేశమంతటా చర్చనీయాంశమైంది. కుటుంబ హింస చట్టాలను సవరించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.  

నీవు చచ్చినా ఫరవాలేదని దూషణలు  
అంతలోనే ఐటీ నగరిలో మరో హృదయ విదారక దుర్ఘటన జరిగింది. భార్య, మామ వేధింపులను భరించలేక ఓ హెడ్‌కానిస్టేబుల్‌ ఇక జీవితం చాలనుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బైయప్పనహళ్లి రైల్వే పోలీసు స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు.. విజయపుర జిల్లా సిందగి తాలూకా హందిగనూరు గ్రామానికి చెందిన తిప్పణ్ణ (35) బెంగళూరు సిటీ పోలీసు విభాగం పరిధిలో హుళిమావులో సివిల్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతని భార్య, మామ వేధిస్తున్నట్లు తెలిసింది. తరచూ అతన్ని కించపరుస్తూ సతాయించేవారు. ఈ నెల 12న కూడా భార్య, మామ ఫోన్‌ చేసి తీవ్రంగా దూషించారు. నీవు చచ్చినా ఫరవాలేదు, నా కూతురు హాయిగా జీవిస్తుంది అని మామ నిందించాడు. ఈ పరిణామాలతో జీవితంపై విరక్తి చెందిన తిప్పణ్ణ డెత్‌నోట్‌ రాసి, రైలు కింద పడ్డాడు. డ్యూటీ నుంచి నేరుగా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.  

తండ్రి ఫిర్యాదు  
తన కుమారుని మృతిపై న్యాయం చేయాలని శుక్రవారం అర్ధరాత్రి మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బైయప్పనహళ్లి రైల్వే పోలీసు స్టేషన్‌లో ఆత్మహత్యకు ప్రేరేపణ తదితర సెక్షన్ల కింద భార్య, మామపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మర   ణోత్తర పరీక్ష కోసం సీవీ రామన్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.   

Atul Subhash Case: అతుల్‌.. అంతులేని ఆవేదన


 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)