Breaking News

సైనికుల్ని మార్చుకుందాం

Published on Tue, 01/14/2025 - 06:29

కీవ్‌: నిర్బంధంలో ఉన్న సైనికులను మార్చుకుందామంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాకు ప్రతిపాదించారు. రష్యా నిర్బంధంలోని తమ సైనికులను వదిలేస్తే పట్టుబడ్డ ఉత్తర కొరియా సైనికులను ఆ దేశానికి అప్పగించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను పట్టుకున్నామన్న ఉక్రెయిన్‌ ప్రకటనను దక్షిణ కొరియా ధ్రువీకరించడం తెలిసిందే. ‘‘మా దగ్గర మరింతమంది కొరియా సైనికులున్నారు. 

రష్యా పట్టుకున్న మా సైనికులను అప్పగిస్తే ఉత్తర కొరియాకు వారి సైనికులను అప్పగించడానికి సిద్ధం’’అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని గురించిన వాస్తవాలను బయట పెట్టేవారికి, శాంతి స్థాపనకు ప్రయత్నించే వారికి అవకాశం కల్పిస్తామన్నారు. 

బెడ్‌పై పడుకొన్న, దవడకు బ్యాండేజ్‌తో మంచంపై కూర్చున్న ఇద్దరు ఉత్తర కొరియా యుద్ధ ఖైదీల వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో అనువాదకుల సహాయంతో జెలెన్‌స్కీ వారితో మాట్లాడుతూ కన్పించారు. ‘‘ఉక్రెయిన్‌తో పోరాడతామని నాకు తెలియదు. శిక్షణ మాత్రమేనని మా కమాండర్లు చెప్పారు’’అని ఆ సైనికులు చెప్పుకొచ్చారు. వారిలో ఒకరు ఉత్తరకొరియా తిరిగి వెళ్లాలని భావిస్తుండగా, అవకాశమిస్తే ఉక్రెయిన్‌లోనే ఉండిపోతానని రెండో సైనికుడు చెప్పాడు. 

2022లో ఉక్రెయిన్‌పై దాడి మొదలైనప్పటి నుంచి రష్యా, ఉత్తర కొరియా సైనిక సహకారాన్ని పెంచుకుంటున్నాయి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా ఇప్పటికే 10,000 మందికి పైగా సైనికులను పంపిందని ఉక్రెయిన్, అమెరికా, దక్షిణ కొరియా ఆరోపించాయి. దీన్ని ఆ దేశాలు కొట్టిపారేశాయి. కానీ రష్యా సైన్యం ఉత్తర కొరియా సైనిక సాయంపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదని జెలెన్‌స్కీ అన్నారు. 
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)