Breaking News

రణభూమిలో యోగ సాధన: సిరియా ముఖచిత్రాన్ని మారుస్తున్న రిషికేశ్‌

Published on Mon, 07/31/2023 - 08:46

సిరియా.. ప్రపంచంలో గడచిన 12 ఏళ్లుగా అంతర్యుద్ధాలతో అట్టుడికికి పోతున్న ఏకైక దేశం. ఈ యుద్ధాల కారణంగా  అక్కడున్న వారు సర్వం కోల్పోతున్నారు. ఆర్థిక, శారీరక, మానసిక కష్టాలతో నిత్యం కుంగిపోతున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలోని వారికి ఇప్పుడు యోగవిద్య వరప్రదాయనిగా మారింది. 

బ్రిటీష్‌ మ్యాగజైన్‌ ఎకనామిస్ట్‌లోని ఒక రిపోర్టు ప్రకారం ‍ప్రస్తుతం సిరియాలో ఉన్న అన్ని మైదానాలు, స్టేడియంలు యోగా తరగతులతో కళకళలాడుతున్నాయి. ఈ తరగతులకు పెద్దలు మొదలు కొని పిల్లల వరకూ అన్ని వయసులు వారు హాజరవుతున్నారు. వారి దినచర్య సూర్యనమస్కారాలతో ప్రారంభమవుతోంది.  

సిరియాలో హిందువుల వేషధారణతో యోగా ట్రైనర్లు యోగ సాధనకు విపరీతమైన ‍ప్రచారం కల్పిస్తున్నారు. యోగ విద్యను మహాశివుని వరప్రసాదంగా చెబుతున్నారు. సిరియాలో యోగ శిక్షణ అందిస్తున్న ఒక అధ్యాపకుడు మాట్లాడుతూ నిత్యం యుద్ధ భయంతో కొట్టుమిట్టాడుతున్న ఇక్కడి ప్రజలకు యోగ ద్వారా ప్రశాంతత పొందే విధానాలను వివరిస్తున్నట్లు తెలిపారు. 

సిరియాకు చెందిన మాజోన్‌ ఈసా అనే వ్యక్తి రెండు దశాబ్ధాల క్రితం యోగా అధ్యయనం కోసం భారత్‌లోని హిమాలయాల్లో గల రిషికేశ్‌ వచ్చారు. తన యోగా అధ్యయనం ముగిశాక తిరిగి సిరియా చేరుకుని, ఒక యోగా సెంటర్‌ ప్రారంభించారు. ఇప్పుడు అతని ప్రేరణతో దేశంలో వేలాది యోగాకేంద్రాలు నడుస్తున్నాయి. కాగా ఈ కేంద్రాలలో ఉచితంగా శిక్షణ అందించడం విశేషం. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ ఇటువంటి యోగ శిక్షణ కేంద్రాలకు మద్దతుగా నిలుస్తున్నారు. 

సున్నీ ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన సిరియాను అర్ధశతాబ్ద కాలంగా అసద్‌ కుటుంబ సభ్యులు పరిపాలిస్తున్నారు. వారు గతంలో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు ఇస్లాంలోని మరోశాఖ అల్విత్‌తో దోస్తీ కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు అసద్‌ కుటుంబ సభ్యుల తీరుతెన్నుల్లో మార్పు వచ్చింది. ఇతర మతాల వారికి కూడా తగిన గుర్తింపునిస్తున్నారు. దీనిలో భాగంగానే యోగ విద్యకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక్కడి క్రైస్తవులకు చర్చిలు నిర్మించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. 
ఇది కూడా చదవండి: ప్రియుని కోసం పాకిస్తాన్‌ వచ్చిన బ్రిటన్‌ మహిళ.. పోలీసులకు చుక్కలు!

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)