Breaking News

'బతికే ఉన్న..' వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ కొత్త వీడియో వైరల్..

Published on Thu, 08/31/2023 - 16:17

వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మరణానికి ముందు ఆఫ్రికాలో ఉన్నట్లు చెప్పుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెలిగ్రామ్  ఛానల్‌లో విడుదలైన వీడియోలో ప్రిగోజిన్ తన యోగక్షేమాల గురించి అలాగే తన భద్రతపై ఉన్న అనుమానాలపై మాట్లాడారు. ఆర్మీ దుస్తులు ధరించి, చేతికి వాచ్ పెట్టి ఉన్న ఆయన మృతికి ముందు ఆగష్టు 21నాటి వీడియోగా భావిస్తున్నారు.

వీడియోలో ప్రిగోజిన్ మాట్లాడుతూ..' నేను బతికానా? ఇంకా చనిపోయానా..? ఎలా ఉన్నాను.. ఏం చేస్తున్నాను? అని చర్చించుకునేవారి కోసమే ఈ వీడియో. ఇది వీకెండ్ ఆగష్టు 2023 చివరి భాగంలో ఉన్నాం. నా జీవితాన్ని అంతం చేయడానికి నిరంతరం చర్చించుకుంటున్నారు. నా వ్యక్తిగత జీవితం, సంపాదన అంతా బాగానే ఉన్నాయ్' అని ప్రిగోజిన్ చెప్పారు. 

ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో షేర్ చేయగా.. ట్విట్టర్‌(ఎక్స్)  లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రిగోజిన్ ఇంకా బతికే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భూగర్భంలో ఉన్నట్లు కామెంట్ బాక్స్‌లో తమ అభిప్రాయాలను రాసుకొచ్చారు. ప్రిగోజిన్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు షేర్ చేయండని మరొక నెటిజన్ స్పందించాడు. 

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రిగోజిన్ తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత ఆయన విమాన ప్రమాదంలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది అనుయాయులు కూడా మృతి చెందారు. వీరి మరణ వార్తను రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించినట్లు స్పష్టం చేసింది. ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఉందనే ఆరోపణలపై క్రెమ్లిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్ని అవాస్తవాలని పేర్కొంది.  

ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్‌


 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)