Breaking News

యాహ్యా సిన్వార్‌ మృతి.. హమాస్‌కు చీఫ్‌ లేనట్లే!

Published on Tue, 10/22/2024 - 07:46

ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇటీవల  హమాస్‌ చీఫ్ యాహ్యా సిన్వార్‌ మృతిచెందారు. దీంతో హామాస్‌ను ఎవరు నడిపిస్తారనే అంశంపై చర్చ  జరగుతోంది. అయితే చీఫ్‌ లేకుండా.. దోహ కేంద్రంగా పాలక కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు హమాస్ వర్గాలు తెలిపాయి. 

మార్చిలో జరగనున్న ఎన్నికల వరకు దివంగత చీఫ్ యాహ్యా సిన్వార్‌కు వారసుడిని నియమించకూడదని హమాస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. టెహ్రాన్‌లో రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య అనంతరం ఆగస్టులో ఏర్పడిన ఐదుగురు సభ్యుల కమిటీ  హమాస్‌ గ్రూప్ నాయకత్వాన్ని తీసుకుంది. ఇక..  సిన్వార్‌ మృతికి ముందు.. గాజాలో ఉన్న ఆయనతో కమ్యూనికేట్ కావటంలో  తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హమాస్‌ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

2017లో హమాస్‌ గ్రూప్‌ గాజా చీఫ్‌గా నియమించబడిన సిన్వార్‌.. జూలైలో హనియే హత్య అనంతరం హమాస్‌ గ్రూప్‌  మొత్తానికి చీఫ్‌గా నియమితులయ్యారు. గాజాకు ఖలీల్ అల్-హయ్యా, వెస్ట్ బ్యాంక్‌కు జహెర్ జబరిన్, విదేశాలలో ఉన్న పాలస్తీనియన్ల కోసం ఖలీద్ మెషాల్ చెందిన ప్రతినిధులతో పాలక కమిటీని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇక.. ఈ పాలక కమిటీలో హమాస్ షూరా సలహా మండలి అధిపతి మహమ్మద్ దర్విష్, పొలిటికల్‌ బ్యూరో కార్యదర్శి కూడా ఉన్నారు.  అయితే.. వీరిని భద్రతా కారణాల దృష్ట్యా గుర్తించకపోవటం గమనార్హం. కమిటీలోని ప్రస్తుత సభ్యులందరూ ఖతార్‌లో ఉన్నారు. యుద్ధం, అసాధారణమైన పరిస్థితులలో దాడులు, భవిష్యత్తు ప్రణాళికలను నిర్వహించటంపై ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ  పాలక కమిటీకి అధికారం ఉంటుంది.

చదవండి: ఇజ్రాయెల్‌ దాడులు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్‌

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)