జిన్‌పింగ్‌ శకానికి తెర? 

Published on Thu, 07/03/2025 - 04:19

చైనాలో షీ జిన్‌పింగ్‌ శకం ముగిసిందా? పలువురు అధ్యక్షులకు పట్టిన గతే ఆయనకు కూడా పట్టనుందా? నెల రోజులుగా డ్రాగన్‌ దేశంలో జరుగుతూ వస్తున్న పలు అనూహ్య పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మే 21 నుంచి జూన్‌ 5 దాకా జిన్‌పింగ్‌ రెండు వారాల పాటు ఆచూకీ లేకుండాపోయారు. అధికారిక కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. కనీసం బహిరంగ వేదికలపై కూడా కన్పించలేదు. 

ఆయన చైనా పగ్గాలు చేపట్టిన గత 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దానికి తోడు అధ్యక్షుని గురించిన వార్తలను ప్రతి రోజూ ఫ్రంట్‌ పేజీల్లో విధిగా ప్రముఖంగా ప్రచురించే చైనా అధికార మీడియాలోఆ రెండు వారాల పాటు ఎక్కడా కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు! అధ్యక్షుని గైర్హాజరీపై ప్రపంచమంతా జోరుగా చర్చ జరిగినా చైనా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అధికారిక మీడియాలోనూ ఖండన వంటివి రాలేదు.

 చివరికి జూన్‌ 5 తర్వాత జిన్‌పింగ్‌ తిరిగి దర్శనమిచ్చినా ఆయనలో ముందున్న కళాకాంతులేవీ కన్పించలేదు. బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకòÙంకోతో జరిగిన భేటీలో బాగా అనాసక్తంగా దర్శనమిచ్చారు. ‘‘జిన్‌పింగ్‌ బాగా నీరసించి, ఆరోగ్యంగా కన్పించారు’’ అని భేటీ తర్వాత బెలారస్‌ అధ్యక్షుని తరఫున వెలువడ్డ అధికారిక మీడియా ప్రకటన పేర్కొంది. దీనికి తోడు జిన్‌పింగ్‌కు భారీ స్థాయిలో ఉండే వ్యక్తిగత భద్రత కూడా కొద్దిరోజులుగా బాగా తగ్గిపోయింది. 

ఆయన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియానికి అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జిన్‌పింగ్‌ ఫోన్‌లో సంభాషించారు. దాన్ని గురించిన చైనా అధికార టీవీ సంస్థ ప్రసారం చేసిన వార్తా కథనంలో జిన్‌పింగ్‌ను ఎలాంటి హోదా లేకుండా సంబోధించడం విశేషం! అతి శక్తిమంతమైన డ్రాగన్‌ దేశాన్ని ఇనుప పిడికిలితో శాసిస్తూ వస్తున్న జిన్‌పింగ్‌కు పాలనకు నూకలు చెల్లాయనేందుకు ఇవన్నీ స్పష్టమైన సంకేతాలేనంటూ జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

పాలక కమ్యూనిస్టు పారీ్టలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు అంతిమంగా జిన్‌పింగ్‌ను తప్పించే దిశగా సాగుతున్నాయంటూ ప్రవాస చైనా మేధావులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జిన్‌పింగ్‌కు ముందున్న అధ్యక్షుడు హూ జింటావో కూడా అధికారాంతానికి ముందు అచ్చం ఇలాగే కొతంకాలం పాటు అనూహ్యంగా కనబడకుండా పోవడం విశేషం. ఆ తర్వాత జిన్‌పింగ్‌ పగ్గాలు చేపట్టారు. అనతికాలంలోనే పార్టీలోని తన విరోధులు, వ్యతిరేకుల ఆట కట్టించి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. 

ఇప్పుడు జిన్‌పింగ్‌కు కూడా అదే గతే పడుతోందంటూ ఆయన వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. నిజానికి జిన్‌పింగ్‌పై తిరుగుబాటుకు పథక రచన చేసింది, నిశ్శబ్దంగా తెర వెనక పావులు కదిపింది 82 ఏళ్ల జింటావోనే అని కూడా చెబుతున్నారు. ఇవేమీ నిజం కాదని, అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నారని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను కలకలం రేపుతోంది.

 బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో శనివారం నుంచి జరగనున్న 17వ బ్రిక్స్‌ సదస్సుకు కూడా జిన్‌పింగ్‌ హాజరు కావడం లేదు. దీన్ని చైనా అధికారికంగా ధ్రువీకరించింది. మూడు రోజుల సదస్సుకు ఆయన బదులుగా ప్రధాని లీ కియాంగ్‌ భేటీలో పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేశారు. బ్రిక్స్‌ సదస్సుకు జిన్‌పింగ్‌ డుమ్మా కొడుతుండటం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి! ఈ పరిణామం ఆయన భవితవ్యంపై అనుమానాలను మరింతగా పెంచుతోంది.  

జాంగ్‌ హవా! 
అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి మాత్రమే గాక సర్వశక్తిమంతమైన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ (సీఎంసీ)కి చైర్మన్‌ కూడా. అయితే ప్రస్తుతం చైనాలో అధికార వ్యవహారాలన్నీ సీఎంసీ వైస్‌ చైర్మన్‌ జనరల్‌ జాంగ్‌ యూక్సియా కనుసన్నల్లో నడుస్తున్నాయని చెబుతున్నారు. జిన్‌పింగ్‌ చైనా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు సహకరించిన వారిలో జాంగ్‌ ముఖ్యుడు కావడం విశేషం! శక్తిమంతమైన 24 మందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరోలో ఆయన సభ్యుడు.

 అంతేగాక పారీ్టలోని సీనియర్‌ సభ్యుల్లో అత్యధికులు ప్రస్తుతం జాంగ్‌కు దన్నుగా నిలిచినట్టు వార్తలొస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు జింటావో అనుయాయులైన వారంతా జిన్‌పింగ్‌ను తొలినుంచీ లోలోపల వ్యతిరేకిస్తూ వస్తున్న వారేనని సమాచారం. నిజానికి సైనిక, ఆర్థిక తదితర కీలక వ్యవహారాల్లో కొన్నాళ్లుగా జిన్‌పింగ్‌ మాట సాగడం లేదని చెబుతున్నారు. అంతేగాక ఆయన అనుయాయులైన డజన్ల కొద్దీ సైనిక జనరళ్లు కొద్ది రోజులుగా అనూహ్యంగా మాయమవుతున్నారు. మరికొందరికి ఉన్నట్టుండి ఉద్వాసన పలికారు.

వారసుడు వాంగ్‌! 
చైనా చైనా కమ్యూనిస్టు పార్టీ సారథిగా ఇటీవలే నియమితుడైన వాంగ్‌యాంగ్‌ త్వరలో జిన్‌పింగ్‌ స్థానంలో అధ్యక్షునిగా పగ్గాలు చేపడతారని వార్తలొస్తున్నాయి. టెక్నోక్రాట్‌ అయిన వాంగ్‌కు మృదు స్వభావిగా, మార్కెట్‌ శక్తుల అనుకూలునిగా పేరుంది. అందుకే సంస్కరణవాది అయిన నాయకునిగా కమ్యూనిస్టు పార్టీ ఆయనను దేశ నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేస్తోందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)