Breaking News

అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధమే: జెలెన్‌స్కీ

Published on Mon, 01/29/2024 - 10:22

కీవ్: మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని రష్యాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. అమెరికా సహా అనేక యూరప్ దేశాలు తమకు మద్దతు తెలుపుతున్నందున యుద్ధానికి ఎంతో దూరంలో లేమని అన్నారు. నాటో కూటమిలో సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. మరో యుద్ధం తప్పనిసరని పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌ ముందే ఊహించారని చెప్పారు.

ఉక్రెయిన్ మొదటి ఆక్రమణలో జర్మనీ తన పాత్ర సరిగా పోషించలేదని జెలెన్‌స్కీ అన్నారు. రష్యాతో యుద్ధంలో ఐరోపా దేశాల బలహీనతలను తాను కూడా అర్ధం చేసుకోగలనని పేర్కొన్నారు. ఉక్రెయిన్ కోసం పెద్ద ఎత్తున నిధులను సమీకరించే అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. ఉక్రెయిన్‌కు మద్దతు పోతుందా? అని ప్రశ్నించగా.. అమెరికా విధానం ఒక వ్యక్తితో ప్రభావితం కాబోదని అన్నారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదికి పైగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా సేనలు ఉక్రెయిన్ భూభాగాలపై విరుచుకుపడుతున్నాయి. అటు అమెరికా, ఐరోపా దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ధీటుగా పోరాడుతోంది. ఇటీవల ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తున్న రష్యా విమానం కూలిన ఘటనలో 65 మంది మృతి చెందారు. ఇరుదేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న క్రమంలో అమెరికా ఆర్థిక సహాయం తగ్గడంపై ఉక్రెయిన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.  

ఇదీ చదవండి: Sudan: సూడాన్‌లో హింస.. 52 మంది మృతి!

Videos

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)