Breaking News

గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన

Published on Sat, 04/12/2025 - 09:13

ఇప్పటికే అద్భుతాలకు నెలవైన చైనా త్వరలో ప్రపంచానికి మరో అద్భుతాన్ని చూపించబోతోంది. అదేమిటో తెలిసినవారంతా ఇప్పుటికే చైనా ప్రతిభకు కితాబిస్తున్నారు. చైనానోలోని గుయిజౌ ప్రావిన్స్‌లో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జి(Huajiang Grand Canyon Bridge) జూన్‌ 25న ఆవిష్కృతం కానుంది. ఇదే ప్రపంచాన్ని అబ్బురపరిచే మరో వండర్‌. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా సరికొత్త రికార్డు సృష్టించనుంది.

చైనా ఈ నూతన వంతెనను.. రెండు మైళ్ల దూరం మేరకు విస్తరించి ఉన్న ఒక భారీ లోయను దాటడానికి నిర్మించింది. ఈ నిర్మాణానికి చైనా సుమారు 216 మిలియన్ పౌండ్లు (₹2200 కోట్లు) వెచ్చించింది.  ఇప్పటివరకూ ఈ లోయను వాహనాల్లో దాటేందుకు ఒక గంట సమయం పడుతుండగా, ఈ వంతెన నిర్మాణంతో కేవలం ఒక్క నిముషం(One minute)లో ఈ వెంతెనను దాటేయవచ్చని చైనా చెబుతోంది. ఈ వంతెన ఎత్తు పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు రెట్టింపు ఎత్తును కలిగి ఉంటుంది.
 

ఈ వంతెన మీద ఒక గాజు నడక మార్గం ఏర్పాటవుతోంది. ఫలితంగా సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూడగలుగుతారు. ఈ వంతెన నుంచి అత్యంత ఎత్తైన బంజీ జంప్‌ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. ఇది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంతెన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది. ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

ఈ వంతెన చైనాకున్న ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని(Engineering ability) ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప నిర్మాణంగా నిలుస్తుంది. అగాథంలాంటి లోయ మీద, ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఈ వంతెన స్థానికుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది. చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనలను నిర్మించింది. అయితే ఈ కొత్త వంతెన ఈ జాబితాలో మరో మైలురాయిగా నిలిచిపోనుంది.

ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే..

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)