Breaking News

World Piano Day: తొలి పియానోను ఎక్కడ భద్రపరిచారు?

Published on Sat, 03/29/2025 - 09:57

నేడు (మార్చి 29).. ప్రపంచ పియానో ​​దినోత్సవం(World Piano Day). పియానోను సంగీత కచేరీలలో ఉపయోగిస్తుంటారు. ఈ వాయిద్య పరికరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పియానోకు సంబంధించిన విషయాలు చాలామందికి తెలియవు. పియానో దినోత్సవం సందర్భంగా ఈ సంగీత పరికరానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

పియానోను తొలిసారిగా 1709లో ఇటలీకి చెందిన హార్ప్సికార్డ్ తయారీదారు బార్టోలోమియో డి ఫ్రాన్సిస్కో క్రిస్టోఫోరీ కనుగొన్నారు. ఆయన రూపొందించిన పియానోలలో ఒకటి న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌(Metropolitan Museum of Art)లో భద్రపరిచారు. పియానో ​​అనేది పియానోఫోర్ట్ అనే పదానికి సంక్షిప్త రూపం. పియానో అంటే మృదువైన, ఫోర్డ్‌ అంటే బిగ్గరగా.. దీని అర్థం ఏమిటంటే ఈ రెండు రకాల శబ్ధాలను పియానోపై పలికించవచ్చు.

తొలినాళ్లలో పియానోలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. వీటిని దాదాపు ఒక శతాబ్దం పాటు ఒక నిర్దిష్ట తరగతికి చెందినవారు మాత్రమే కొనుగోలు చేయగలిగేవారు. నూతన పియానోను దాని కొత్త వాతావరణానికి, మారుతున్న రుతువులకు అనుగుణంగా ట్యూన్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఏడాదికి రెండుసార్లు ట్యూనింగ్(Tuning) చేస్తారు. పియానోలో మొత్తం 88 నలుపు రంగు, తెలుపు రంగు కీలు ఉంటాయి. పియానో ​​క్లిష్టమైన వాయిద్య పరికరం. దీనిలో 12 వేలకు పైగా విడి భాగాలు ఉంటాయి.

ప్రపంచంలో అతిపెద్ద పియానో ​​1.4 టన్నుల బరువు, 5.7 మీటర్ల పొడవు కలిగివుంది. దీనిని న్యూజిలాండ్ పియానో ​​ట్యూనర్ అడ్రియన్ మాన్ రూపొందించారు. పియానో ​​ రెండు విధాలుగా ధ్వనిని  అందిస్తుంది. మొదటిది బిగ్గరగా, రెండవది మెల్లగా ఉంటుంది. ఈ రెండు శబ్దాలు సరైన క్రమంలో ఉత్పత్తి అయినప్పుడు, శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. పియోనాను కీబోర్డ్ ఆధారంగా రూపొందిస్తుంటారు. దీనిలో ఏదైనా కీని గట్టిగా నొక్కితే పెద్ద శబ్దం వస్తుంది, అదే కీని మెల్లగా నొక్కినప్పుడు మృదువైన శబ్దం వస్తుంది.

ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీ తెలివైన వ్యక్తి’.. భారత్‌ సుంకాలపై స్పందించిన ట్రంప్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)