Breaking News

ప్రపంచంలోనే అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!

Published on Sun, 02/15/2026 - 13:32

అందమైన ప్రకృతిలో అనేక రకాల వన్యప్రాణులు, పక్షులు మనల్ని అలరిస్తూ ఉంటాయి. ఇవి ప్రకృతికి, మానవ సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తాయి తప్ప కీడు చేయవు. కానీ ప్రపంచంలోని ఏకైక విషపూరిత పక్షి ఒకటి  ఉంది తెలుసా. పైకి రంగు రంగుల్లో అందిస్తూ కనిపిస్తూ మానవులకు కీడు చేస్తుంది. అదేంటో? దానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలేంటో  తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విషపూరితమైన పక్షి.  హుడెడ్ పిటోహుయ్ (Hooded Pitohui) న్యూ గినియా (New Guinea) లోని అడవుల్లో కనిపిస్తాయి. ఇవి చూడటానికి నారింజ మరియు నలుపు రంగుల కలయికతో చాలా అందంగా ఉంటాయి. కానీ దీని ఈకలను తాకినా, లేదా దాని మాంసాన్ని ఆహారంగా తీసుకున్నాతీవ్రమైన నాడీ సంబంధిత ప్రభావాలు ఏర్పడవచ్చు.  సాధారణంగా  వీటిని వండుకుని తినడానికి వీలుండదు (వండితే ఘాటైన వాసన , విషం వల్ల అనారోగ్యం కలుగుతుంది)ముఖ్యంగా జలదరింపు, తిమ్మిరి లేదా తేలికపాటి పక్షవాతం వంటివి సంభవించవచ్చు.  

విషపూరితమైన పక్షి ఎలా అయ్యింది?
సాధారణంగా పాములు లేదా కప్పలు విషపూరితంగా ఉండటం చూస్తుంటాం, కానీ ఈ పక్షి ఈకలు, చర్మం , మాంసంలో కూడా విషం ఉంటుంది. పిటోహుయిస్ తమ సొంత విషాన్ని తయారు చేసుకోవు. హుడెడ్ పిటోహుయిస్ గురించి అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఇదొకటి. వాటి ఆహారం నుండి సీక్వెస్ట్రేషన్ అనే ప్రక్రియ ద్వారా పాయిజన్‌ఉత్పత్తి అవుతుంది. అంటే అవితీసుకున్న ఆహారంనుంచి విషాన్ని వారి శరీరంలో నిల్వ  ఉంటుంది.

ఇవి తినే ఒక రకమైన 'మెలైరిడ్' (Melyrid) బీటిల్స్ (పురుగులు) వల్ల వీటి శరీరంలోకి విషం చేరుతుందని జాక్ డంబాచర్‌తో సహా శాస్త్రవేత్తలు గుర్తించారు. హుడెడ్ పిటోహుయి కలిగి ఉన్న ఈ పురుగుల్లో విషాన్ని బాట్రాకోటాక్సిన్ (Batrachotoxin) అంటారు. ఇదే విషం కొలంబియాలోని 'పాయిజన్ డార్ట్' కప్పలలో కూడా కనిపిస్తుంది.అందుకే స్థానిక ప్రజలు వీటిని "చెత్త పక్షులు" అని పిలుస్తారు.

 ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం

మనుషులపై ప్రభావం
ఒకవేళ ఎవరైనా ఈ పక్షిని పట్టుకుంటే, ఆ విషం వల్ల చేతులు మొద్దుబారిపోవడం, మంట పుట్టడం లేదా తీవ్రమైన తుమ్ములు రావడం వంటివి జరుగుతాయి. ఈ విషపదార్థాలు పక్షి తనను తాను వేటాడే జంతువులు ,పరాన్నజీవుల నుండి రక్షించుకోవడానికి సహాయపడతాయి.పాములు లేదా ఇతర జంతువులు ఈ పక్షిని వేటాడకుండా ఈ విషం కాపాడుతుంది. అంతేకాదు వీటి ఈ ఈకల్లోని విషం వల్ల పేలు, బ్యాక్టీరియా వంటివి పక్షికి సోకవు.

ఇది విషపూరితమని ఎపుడు గుర్తించారు
శాస్త్రవేత్త జాక్ డంబాచర్ 1980ల చివరలో న్యూ గినియాలో ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి సారిగా ఈ విషపూరిత పక్షిని కనుగొన్నాడు. అతన ఈ పక్షులను తాకినప్పుడు, తన నోటిని లేదా కళ్ళను తాకిన తర్వాత, జలదరింపు, తిమ్మిరి, మండుతున్న అనుభూతిని అనుభవించాడని డిస్కవర్ వైల్డ్‌లైఫ్ తెలిపింది. తరువాత, పక్షి ఈకలు , చర్మం విషపూరితమైనవని కూడా గ్రహించాడు.  1992లో డంబాచర్, అతని బృందం హుడెడ్ పిటోహుయ్ చర్మం, ఈకలలో బాట్రాచోటాక్సిన్ అనే శక్తివంతమైన విషం, విషపూరిత సమ్మేళనాలు ఉన్నాయని చూపించే ఒక అధ్యయనాన్ని కూడా ప్రచురించింది.  

ఇదీ చదవండి: బోట్‌ రైడ్‌లో ఒక్కసారిగా రాకాసి అలలు, వీడియో వైరల్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)