Breaking News

పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు

Published on Sun, 09/24/2023 - 09:32

అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభాన్ని సరిదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సైనిక, రాజకీయ, వాణిజ్యంలో నాయకుల స్వార్ధప్రయోజనాలు పక్కకు పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వరల్డ్ బ్యాంకు పాక్‌ ప్రతినిధి నజీ బాన్‌హాస్సిన్ అన్నారు. 

పాకిస్థాన్‌ ప్రస్తుతం సంక్షోభం అంచున ఉంది. 40 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ ధరలు, తగినన్ని వనరులు లేకపోవడం సహా అనేక ఆర్ధిక కష్టాలను పాక్ ఎదుర్కొంటోంది. పిల్లల విద్యా ప్రమాణాలు, చిన్నారుల మరణాలు వంటి సూచికలు.. పాక్ పేదరికం తారా స్థాయికి చేరిందని చెబుతున్నాయని  నజీ బాన్‌హాస్సిన్ తెలిపారు. 

2000 నుంచి 2020 మధ్య కాలంలో పాకిస్థాన్ సగటు వాస్తవ తలసరి వృద్ధి రేటు కేవలం 1.7 శాతం మాత్రమే. ఇది దక్షిణాఫ్రికా దేశాల సగటు తలసరి వృద్ధి రేటులో సగం కంటే తక్కువగా ఉందని నజీ వెల్లడించారు. పాక్ మానవాభివృద్ధి సూచికలోనూ దక్షిణాసియాలో చిట్టచివరన ఉంది. విదేశీ నిల్వలు అడుగంటాయి. వాతావరణ మార్పులు ఆ దేశానికి శాపంగా మారుతున్నాయి. 

పాక్‌లో వచ్చే జనవరిలో జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఆర్ధిక పరిస్థితులు బాగులేని కారణంగా ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్ధిక వ్యవస్థను సరిచేసుకోవాల్సిన సమయమని సూచించింది. నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉచిత హామీలకు పోకూడదని పేర్కొంది. ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టడానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరింది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. ప్రజా సేవలు, మౌలిక సదుపాయాల్లో పరిమితమైన ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. 

ఇదీ చదవండి: పీఓకేను ఖాళీ చేయండి: భారత్‌ అల్టిమేటమ్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)