Breaking News

లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ

Published on Mon, 07/17/2023 - 11:26

బీజింగ్: దక్షిణ చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రావిన్స్ ఎయిర్ పోర్టులో ఒకామె తన లోదుస్తుల్లో ఐదు బ్రతికున్న పాములను అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది. ఆమె శరీరాకృతి విచిత్రంగా ఉండటంతో అనుమానం వచ్చి శెంజిన్ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది.  

అదేంటో.. ప్రపంచంలో చిత్ర విచిత్రమైన సంఘటనలన్నీ చైనాలోనే చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్ పోర్టుల్లో ఈ విధంగా జీవులను తరలిస్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి.

సాధారణంగా ఇలాంటి కేసుల్లో అత్యధిక స్మగ్లర్లు బ్యాగుల్లో, బాక్సుల్లో లేదా మరో విధంగా వాటిని తరలిస్తూ ఉంటారు. కానీ ప్రమాదకరంగా విషపూరితమైన సర్పాలను శరీరంలో దాచుకుని తరలించిన సంఘటనలు చాలా అరుదు.

కస్టమ్స్ అధికారులు పేరు చెప్పడానికి నిరాకరించిన దక్షిణాఫ్రికాకు చెందిన సదరు మహిళ సజీవంగా ఉన్న ఒక్కో పాముని ఒక్కో స్టాకింగ్ లో పెట్టి ప్యాక్ చేసింది. ఆ ఐదు స్టాకింగ్ బ్యాగులను తన ఛాతీ వద్ద లోదుస్తుల్లో జాగ్రత్తగా పెట్టుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా యధాతధంగా పైన డ్రెస్ వేసుకుంది.

ఆమె ఎయిర్ పోర్టులోకి అడుగుపెడుతూనే కస్టమ్స్ అధికారులకు ఆమె ఆకృతి చూసి అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను అడ్డగించి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  

ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఐదు పాములను జెర్రిపోతులుగా గుర్తించి వాటిని జంతు సంరక్షణ శాలకు తరలించారు. 

ఇది కూడా చదవండి: పాకిస్తాన్ లో హిందూ దేవాలయంపై దాడి.. పబ్జీ లవ్ స్టోరీనే కారణమా?

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)