Breaking News

‘నీకు పెళ్లయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది’.. షాకిస్తున్న ఎలక్ట్రీషియన్‌ లెటర్‌!

Published on Thu, 08/10/2023 - 11:21

ఇంటిలో పనిచేసేందుకు వచ్చే ఎలక్ట్రీషియన్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌లాంటి వారు ఒక్కోసారి ఆ ఇంటిలోని మహిళలను వేధించిన ఘటనలను మనం చూస్తుంటాం. ఇటువంటి సందర్భాల్లో కొందరు దుర్మార్గులయితే పెళ్లయిన మహిళలతో స్నేహం చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన మెకియన్‌ మెక్‌క్రాకెన్‌ అనే మహిళకు విచిత్ర ఘటన ఎదురయ్యింది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె టిక్‌టాక్‌లో షేర్‌ చేసింది.  

మెకియన్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త కొలెటల్‌, మరిది డెవ్‌ బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి ఫర్నీచర్‌ స్టోర్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. స్టోర్‌లోని ఫ్యాను మరమ్మతు చేసేందుకు ఒక ఎలక్ట్రీషియన్‌ను  పిలిచారు. నాటి అనుభవం గురించి మెకియన్‌  మాట్లాడుతూ ‘ఎలక్ట్రీషియన్‌ ఫ్యాను బాగు చేసేందుకు అనువుగా అక్కడి సోఫాను పక్కకు జరిపాను. అలాగే ఆ ఎలక్ట్రీషియన్‌కు సాయం చేసే ఉద్దేశంతో ఏమైనా కావాలా’ అని అడిగాను. దానికి ఆ ఎలక్ట్రీషియన్‌ సమాధానమిస్తూ ‘మీ ఆదేశాలను శిరసావహిస్తాను’ అని నెమ్మదిగా అన్నాడు.  
   
అయితే ఈ మాటను ఆమె పెద్దగా పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయింది. తరువాత ఎలక్ట్రీషియన్‌ బాత్రూమ్‌ వినియోగించుకునేందుకు ఆమె అనుమతి కోరాడు. తరువాత ‘మీరు ఎంతో అందంగా ఉన్నారు. అయితే మీకు వివాహం జరిగిందని తెలిసి నా హృదయం ముక్కలయ్యింది. అయినా మీరు నాతో రావాలనుకుంటే వచ్చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. సోఫా కుషన్‌పై మీకోసం ఒక లెటర్‌ అతికించాను’ అని అన్నాడు. ఈ మాటలు విన్న మెకియన్‌ కంగారు పడిపోయింది. 

అతను పని ముగించుకుని వెళ్లేవరకూ వేచిచూసింది. అతను వెళ్లగానే కుషన్‌పై అంటించిన లెటర్‌ చదివింది. దానిలో.. ‘నిన్ను ఇబ్బందుల్లో పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. నీకు పెళ్లయినప్పటికీ, నాతో రావాలనుకుంటే వచ్చేయ్‌, నేను నీకు అన్ని ఆనందాలను అందిస్తాను’ అని ఉంది.  
 

ఈ విషయాన్ని మెకియన్‌ తన భర్తకు తెలియజేసింది. వెంటనే భర్త ఆ ఎలక్ట్రీషియన్‌ను నిలదీశాడు. దీంతో ఆ ఎలక్ట్రీషియన్‌ మెకియన్‌కు క్షమాపణలు చెప్పాడు. సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్న ఈ పోస్టును చూసి యూజర్లు రకరకాలుగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్‌.. మీరు ఆ ఎలక్ట్రీషియన్‌ బాస్‌కు ఫిర్యాదు చేయాల్సింది అని  సలహా ఇవ్వగా, మరొకరు ఆ ఎలక్ట్రీషియన్‌ పనిచేస్తున్న కంపెనీ రివ్యూలో ఈ విషయాన్ని రాయాలని కోరారు.
ఇది కూడా చదవండి:  పాకిస్తాన్‌ ‘ఆణిముత్యం’.. ఎవరికీ తెలియని షాహిద్‌ ఖాన్‌ సక్సెస్‌ స్టోరీ!

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)