Breaking News

200 ఏళ్లనాటి ఫార్మ్‌హౌస్‌లో రహస్య భూగృహం.. లోపల ఏముందో చూసేసరికి..

Published on Mon, 07/10/2023 - 07:12

ఒక్కోసారి కొన్ని దశాబ్ధాల పురాతన గృహాలలో అనుకోని విధంగా ఏవైనా లభిస్తే  మన ఆశ్చర్యానికి అవధులు ఉండవు. యూకేలోని ఒక టిక్‌టాకర్‌ తన తల్లిదండ్రులకు సంబంధించిన 200 ఏళ్ల క్రితం నాటి పురాతన ఫార్మ్‌హౌస్‌లోని ఫ్లోర్‌బోర్డ్‌ కింద కనిపించిన ఆనవాళ్లు చూసి తెగ ఆశ్చర్యపోయింది. ఇటువంటిది ఒకటి ఉందని ఆమెకు బాల్యంలో ఎప్పుడూ తెలియలేదు. ఇంటి రెనోవేషన్‌ సందర్భంగా ఆ ఇంటిలో ఒక భూగృహం ఉందని ఆమెకు తెలిసింది.

దశాబ్ధాల తరబడి రహస్యంగా..
జెనిఫర్‌ మల్లాఘన్‌ ఇటీవల తమ చారిత్రాత్మక పురాతన ఇంటికి సంబంధించిన ఒక వీడియోను టిక్‌టాక్‌లో షేర్‌ చేసింది. ఈ ఇంటిలో తన తల్లిదండ్రులు 6 దశాబ్ధాల పాటు ఉన్నారని, అయితే తనకు ఈ ఇంటిలో భూగృహం ఉందన్న సంగతి ఇన్నాళ్లలో తెలియలేదన్నారు. జెనీఫర్‌ ఈ వీడియో కాప్షన్‌లో ‘ఈ భూగృహం ఏళ్ల తరబడి రహస్యంగానే ఉంది’ అని పేర్కొన్నారు. 44 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తవ్వకాల మధ్య నిలుచుని, చేతులతో ఒక పరికరం పట్టుకుని, కంపార్ట్‌మెంట్‌ను తెరిచే ప్రయత్నం చేస్తుంటాడు. లోపల చీకటిగా ఉంటూ, ఆ గది భయం గొలిపేదిగా కనిపిస్తుంది.

గది తెరుచుకున్నా..
మల్లాఘన్‌  మాట్లాడుతూ భయపెడుతున్న ఆ గదిలో ఎటువంటి సామాను లేదని తెలిపింది. విలువైన ఖజానా అంతకన్నా లేదని పేర్కొంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్‌ ఈ గదిని రెనోవేషన్‌ చేస్తారా? అని అడగగా, దానికి జవాబుగా ఆమె ఆ గది రెనోవేషన్‌ చేయబోమని, దానిలో ఏముందో చూడాలని అనుకున్నామని తెలిపింది.

గతంలోనూ బయల్పడిన భూగృహాలు
ఈ విధంగా భూగృహం బయటపడటం ఇదేమీ తొలిసారి కాదు. గత నెలలోనే ఒక రెడిట్‌ యూజర్‌ తమ కొత్త ఇంటిలో హిడెన్‌ రూమ్‌లో కొన్ని ప్రైవేట్‌ వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. 1970-1980ల మధ్యకాలం నాటి ఈ గదిలో కొన్ని పురాతన వస్తువులతో పాటు ఒక బీరుబాటిల్‌ కూడా దొరికిందని పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)