Breaking News

ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..?

Published on Sat, 07/01/2023 - 17:28

బ్యాంకాక్: నడిచే ఎస్కలేటర్ లో పొరపాటున కాలు పడి ఇరుక్కోవడంతో 57 ఏళ్ల మహిళ మోకాలి పైభాగం వరకు కాలును తొలగించిన సంఘటన థాయ్ లాండ్లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. దీంతో పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో సౌకర్యాలపై అనుమానాలు కమ్ముకుని, ఇకపై బ్యాంకాక్ పర్యటన అంటే పర్యాటకులు ఆలోచించే పరిస్థితి నెలకొంది. 

డాన్ ముయాంగ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కారంత్ తనకుల్జీరపత్ తెలిపిన వివరాల ప్రకారం నఖోన్ సి తమ్మారత్ వెళ్తోన్న ఒక మహిళ నడిచే ఎస్కలేటర్ మీద వెళ్తుండగా ఉన్నట్టుండి ఆమె కాలు ఎస్కలేటర్ లోపల ఇరుక్కుపోయింది. చాలాసేపు నొప్పితో విలవిల్లాడిపోయిన ఆ మహిళకు విముక్తి కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేశామని అన్నారు. 

ఇరుక్కున్న కాలిని విడిపించేందుకు చాలాసేపు శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంలో ఆమె కాలును మోకాలి పైభాగం వరకు తొలగించి అనంతరం దగ్గర్లోని బుమ్రుంగ్రాండ్ అంతర్జాతీయ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు కారంత్. ప్రమాదానికి గల కారణం ఏమిటన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 

మా వలన ఆ మహిళకు జరిగిన నష్టానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని.. జరిగిన తప్పిదానికి మేము పూర్తి బాధ్యత వహిస్తామని, ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు తోపాటు ఆమెకు ఎలాంటి పరిహారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కారంత్.

బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. మా అమ్మ పైకి ధైర్యంగానే ఉన్నప్పటికీ కాలు తీసేయడంతో ఆమె గుండె బద్దలైందని ఒకే కాలితో  జీవితాంతం ఎలాగన్న ఆలోచన తనను లోలోపలే తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.  

ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్‌..! వీడియో బయటకు

    

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)