Breaking News

చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే?

Published on Fri, 03/03/2023 - 17:01

రెస్టారెంట్ కిచెన్లలో సిబ్బంది మొబైల్ ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధిస్తారు యజమానులు. వేడి వాతావరణం, గ్యాస్ లీకైతే పేలుడు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ముందుజాగ్రత్తగా ఫోన్లు తీసుకురావొద్దని చెబుతారు. అయితే ఓ మహిళ మాత్రం ఈ రూల్‌ను పక్కనపెట్టింది. మొబైల్‌ ఫోన్‌ను రెస్టారెంట్‌ కిచెన్‌లోకి తీసుకెళ్లింది. ఫ్రై చేస్తున్న సమయంలో ఫోన్‌లో ఏదో నోటిఫికేషన్ రావడంతో ఆమె దృష్టిమళ్లింది. వెంటనే జేబులోనుంచి ఫోన్ తీసి చూసింది.

అయితే అనుకోకుండా ఆ ఫోన్ ఆమె చేతిలోనుంచి జారి సలసల మరిగే నూనెలో పడిపోయింది. దీంతో షాకైన ఆమె వెంటనే పట్టుకారుతో ఆ ఫోన్‌ను నూనెలోనుంచి బయటకు తీసింది. కానీ అప్పటికే అంతా అయిపోయింది. ఆ ఫోన్ దేనికి పనికిరాకుండా పోయింది. ఆ మహిళ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ఆ ఫోన్‌ను వెంటనే బియ్యంలో పెట్టారా? అలా చేస్తే పనిచేస్తుంది కదా? అని ఓ నెటిజన్ చలోక్తులు విసిరాడు.

మరో యూజర్ స్పందిస్తూ.. ఫోన్ సంగతి సరే.. ఆ నూనెను మార్చాల్సి వస్తుందని వారు బాధపడుతున్నారేమో? సలసల మరిగే నూనెలో సెల్‌ఫోన్ పడితే ఎలాంటి కెమికల్స్ విడుదలవుతాయో ఆ దేవుడికే తెలియాలి అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఫోన్ నూనెలో పడగానే నేనింకా ఆమె చేతితో దాన్ని బయటకు తీస్తుందేమో అనుకున్నా.. అని నవ్వులు పూయించాడు.
చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్‌! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)