Breaking News

అర్ధరాత్రి, వణికించే చలిలో క్యాబ్‌లోనే ప్రసవం

Published on Sat, 01/03/2026 - 08:00

టొరంటో: అర్ధరాత్రి. ఎముకలు కొరికే చలి. ఏకంగా మైనస్‌ 23 డిగ్రీల అతి శీతల వాతావరణం. వెనక సీట్లో నిండు గర్భిణి ప్రసవ వేదన. టైర్లకు అస్సలు పట్టు దొరక్క రోడ్డుపై నుంచి పక్కలకు జారిపోతున్న కారు. ఇంకోవైపు నొప్పులు భరించలేక సీటును తంతూ, కేకలు పెడుతూ ఆమె పడుతున్న వేదన. పక్కనే కూచుని బిక్కచచ్చిపోయి చూస్తున్న భర్త. ఆ అరుపుల్ని ఉంటూ, ఆమె బాధను వ్యూ మిర్రర్‌ లోంచి చూస్తూ, అత్యంత ప్రతికూలమైన ఆ పరిస్థితుల్లో తనను తక్షణం ఆస్పత్రికి చేర్చాల్సిన బాధ్యత. కెనడాలో (Canada) భారత సంతతికి చెందిన హర్‌ దీప్‌ సింగ్‌ తూర్‌ అనే క్యాబ్‌ డ్రైవర్‌ తన వృత్తి జీవితంలోనే ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఇది. 

దీనికి తోడు ప్రతి జంక్షన్‌ లోనూ రెడ్‌ సిగ్నల్స్‌. అయినా అన్నింటికీ తట్టుకుంటూ పళ్ల బిగువున దూసుకెళ్లారాయన. అయితే ఆస్పత్రి కనుచూపు మేరలో ఉండగానే కారు వెనక సీటులోనే ప్రసవించిందా మహిళ. అనంతరం కొన్ని క్షణాల్లోనే తల్లీబిడ్డా ఇద్దరినీ భద్రంగా ఆస్పత్రికి చేరవేసి ఊపిరి పీల్చుకున్నారు హర్‌ దీప్‌. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన గత శనివారం టొరంటోలో జరిగింది. ఆ అనుభవాన్ని ఆయన స్థానిక మీడియాతో పంచుకున్నారు. 

‘ఇక ఇంటిముఖం పడదామని అనుకుంటుండగా ఓ బుకింగ్‌ వచ్చింది. అర్జంటుగా ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. తీరా పికప్‌కు వెళ్లాక నిండు గర్భిణిని ఆమె సహచరుడు అతి కష్టమ్మీద తీసుకొచ్చి వెనక సీట్లో పడుకోబెట్టాడు. కార్లో ప్రయాణం ఆమెకు సేఫ్‌ కాదనిపించింది. అంబులెన్స్‌ పిలుద్దామా అని ఆలోచించా. కానీ అర్ధరాత్రి, అంత చలిలో అది రావడానికి సమయం పడుతుంది. అంత ఆలస్యం చేస్తే ప్రమాదమని తెగించి బయల్దేరా. ఆ అరగంట డ్రైవ్‌ నా జీవితంలోనే అతి సుదీర్ఘమైనదిగా తోచింది. ఎలాగైతేనేం, చివరికి తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉండటం ఎంతో సంతోషాన్నిచ్చింది‘ అంటూ చెప్పుకొచ్చారు. ఇద్దరిని ఎక్కించుకుని ముగ్గురిని దించిన ఘనత తనకే దక్కిందంటూ నవ్వులు పూయించారు.

చ‌ద‌వండి: ఇండియా అబ్బాయి.. జ‌పాన్ అమ్మాయి!   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)