Breaking News

మరింత అగ్గి రాజేసేలా.. పాక్‌ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Sat, 05/03/2025 - 15:56

తీరుమార్చుకోని పాకిస్థాన్‌ మరోసారి బెదిరింపులకు దిగింది. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే.  ఈ అంశంపై మాట్లాడిన పాక్‌ రక్షణ మంత్రి.. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్‌ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.

తాజాగా పాకిస్థాన్‌ ఓడలపై భారత్‌ నిషేధం విధించింది. పాకిస్థాన్‌ జెండా ఉన్న ఏ ఓడ కూడా భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలే తీసుకుంటోంది.

అన్ని రకాల మెయిల్స్‌, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేసింది. పాక్‌ నుంచి వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్‌, పార్సిళ్లపై ఆంక్షలు విధించింది. కాగా, భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వీసాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్‌ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

 


 

 


 

 

 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)