Breaking News

ఉద్యోగాలకు డిగ్రీ తప్పనిసరేం కాదు : కమలా హారిస్‌

Published on Sat, 09/14/2024 - 16:55

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఉద్యోగాలు, విద్యార్హతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అద్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత దేశంలో కొన్ని ఫెడరల్‌ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతను తొలగిస్తానని పేర్కొన్నారు. ఓ వ్యక్తి నైపుణ్యాలను ప్రదర్శించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు.

ఈ మేరకు పెన్సిల్వేనియాలోని విల్కేస్‌-బారేలో ప్రసంగిస్తూ.. ‘నేను అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. ఫెడరల్‌ ఉద్యోగాల కోసం అవసరంలేని డిగ్రీ అర్హతను తొలగిస్తాను. ఇది నాలుగు సంవత్సరాల డిగ్రీ లేని వారికి ఉద్యోగాల అవకాశాలు పెంచడానికి దోహదపడుతుంది. ’ అని తెలిపారు.

కళాశాల డిగ్రీ కంటే అప్రెంటిస్‌షిప్‌, సాంకేంతిక కార్యక్రమాలు వంటివి విజయానికి గల మార్గాల విలువను అమెరికా గుర్తించాలని అన్నారు. వ్యక్తి నైపుణ్యాలను సూచించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు. అదే విధంగా ప్రైవేట్ రంగం కూడా ఇదే విధాన్ని పాటించేలా చూస్తానని భరోసా ఇచ్చారు.

అయితే కమలా హారిస్‌ ప్రసంగానికి. నిరసనకారుల ఆందోళన  వల్ల అంతరాయం ఏర్పడింది. గాజాలో 10 వేల మంది మరణానికి కారణమైన ఇజ్రాయెల్‌ యుద్ధానికి యూఎస్‌ మద్దత తెలపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాల రవాణాపై ఆంక్షలు విధించాలని, యుద్ధాన్ని ముగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో హారిస్‌ మాట్లాడుతూ..తమ ఆందోళనలను గౌరవిస్తానని చెప్పారు. కాల్పుల విరమణ, బందీల రక్షణ ఒప్పందానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. 
చదవండి: పుతిన్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై బైడెన్‌ ఆగ్రహం

ఇదిలా ఉండగా హారిస్ ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నారు.  గత అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌లకు అత్యధికంగా ఓటు వేసిన కార్యకర్తలు, ముస్లింలు, అరబ్బులతో సహా పాలస్తీనా అనుకూల అమెరికన్లు ఉన్నారు. వీరు ఈసారి తమ ఆలోచనను మార్చుకుంటే.. అది హారిస్‌ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.

అయితే 2023లో యూఎస్‌ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్‌ యువతలో 62% కంటే ఎక్కువ మంది బ్యాచిలర్ డిగ్రీని కూడా కలిగి లేరు.  2020లో ఐదుగురు ఓటర్లలో ముగ్గురు  కళాశాల డిగ్రీ కూడా చేయలేదు. ఇందుకు కారణం విద్యకు అధిక ఖర్చు అవ్వడమేనని తేలింది.

కాగా అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరులో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడబోతున్నారు. వీరిరువురు ఇటీవల ఓ టీవీ చర్చలో పాల్గొన్న విషయం తెలిసిందే. 

Videos

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)