Breaking News

ట్రంప్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్‌

Published on Thu, 11/07/2024 - 08:04

మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ఎన్నికల్లో విజయానికి ట్రంప్‌ను అభినందించారు. ట్రంప్‌ను ధైర్యశాలిగా అభివర్ణించారు. సోచిలో శుక్రవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వైట్‌హౌస్‌లో తొలి విడతలో ట్రంప్‌ అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని పుతిన్‌ అన్నారు. 

ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకగలనని ట్రంప్‌ అనడంపై స్పందిస్తూ.. కనీసం దృష్టి పెట్టాల్సిన అంశమిదని రష్యా అధ్యక్షుడు అన్నారు. జూలైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై మాట్లాడుతూ.. ఆయనపై ఒక అభిప్రాయానికి రావడానికి ఇది దోహదపడిందని పేర్కొన్నారు.

 కాల్పులు జరిగి చెవి నుంచి రక్తమోడుతున్నా.. ట్రంప్‌ వెంటనే తేరుకొని పిడికిలి బిగించి.. ఫైట్, ఫైట్, ఫైట్‌.. అని నినదించిన విషయం తెలిసిందే. దీనిపై పుతిన్‌ మాట్లాడుతూ.. ‘ట్రంప్‌ చక్కగా స్పందించారు. ధైర్యంగా పరిస్థి తులను ఎదుర్కొ న్నారు. ధీశాలి’ అని కితాబి చ్చారు. గురువారం ట్రంప్‌ ఎన్‌బీసీ ఛానల్‌తో మాట్లాడు తూ.. పుతిన్‌తో మాట్లాడాలని భావిస్తున్నా నన్నారు. దీనిపై పుతిన్‌ స్పందిస్తూ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని విలేకరులతో అన్నారు.  

సూపర్‌ పవర్‌ దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలి
ప్రపంచంలోని అత్యంత బలీయమైన దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ప్రపంచదేశాలన్నింటిలోకి భారత ఆర్థికవ్యవస్థే అతి వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. శుక్రవారం పుతిన్‌ సోచిలో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. 
 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)