Breaking News

ట్రంప్‌..‘ది పీస్‌ ప్రెసిడెంట్‌’: వైట్‌హౌస్‌

Published on Thu, 10/09/2025 - 09:02

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత కొంత కాలంగా తను నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాను ఏడు యుద్ధాలను ఆపినట్టు ట్రంప్‌ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ విషయమై వైట్‌హౌస్‌ ఆయనను ‘ది పీస్ ప్రెసిడెంట్’గా పేర్కొంది. కాగా, ప్రస్తుతం నోబెల్‌ బహుమతులకు సంబంధించి.. వివిధ విభాగాలకు విజేతలను ప్రకటిస్తున్నారు. శాంతి బహుమతికి ఇంకా ప్రకటించలేదు.

నోబెల్‌ శాంతి బహుమతి శుక్రవారం ప్రకటించాల్సి ఉండగా.. ఈ విషయమై తాజాగా ట్రంప్‌ను మీడియా ప్రశ్నించారు. ఈ సందర్బంగా ట్రంప్‌ స్పందిస్తూ..‘నాకు అదంతా తెలియదు.. నేను ఏడు యుద్ధాలను పరిష్కరించాను. ఎనిమిదో యుద్ధాన్ని(ఉక్రెయిన్‌, రష్య) పరిష్కరించడానికి దగ్గరగా ఉన్నాము. రష్యా పరిస్థితిని మనం పరిష్కరించుకుంటామని నేను అనుకుంటున్నాను. చరిత్రలో ఎవరూ ఇన్ని యుద్ధాలను ఆపలేదు. నోబెల్‌ శాంతి బహుమతి కోసం ఇప్పటికే పలు దేశాలు నన్ను నామినేట్‌ చేశాయి. కానీ, నోబెల్‌ కమిటీ మాత్రం.. నాకు శాంతి బహుమతి రాకుండగా.. ఒక కారణాన్ని కనుగొంటున్నారు అని విమర్శలు చేశారు.

మరోవైపు.. ట్రంప్‌కు నోబెల్‌ శాంతి విషయంలో తాజాగా వైట్‌హౌస్‌ స్పందించింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..‘ది పీస్ ప్రెసిడెంట్’ అనే శీర్షికతో ప్రకటనను పంచుకుంది. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేసిన దేశాలలో పాకిస్తాన్ కూడా ఉంది. జూన్ 20న, ఇస్లామాబాద్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేస్తామని ప్రకటించింది ఇటీవల భారత్‌-పాకిస్తాన్ సంక్షోభంలో ఆయన నిర్ణయాత్మక దౌత్య జోక్యం కీలకమైన నాయకత్వం వహించారని పాక్‌ చెప్పుకొచ్చింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)