Breaking News

‘భారత్‌-పాక్‌ మధ్యవర్తిత్వంలో ట్రంప్‌ కీలకం’: వైట్‌ హౌస్‌ వంతపాట..

Published on Tue, 07/22/2025 - 08:41

వాషింగ​్టన్‌: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న అశాంతిని చల్లార్చడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని యూఎస్‌ఏ అధికార కార్యాలయం వైట్‌హౌస్‌ పునరుద్ఘాటించింది. ట్రంప్‌ అధికార యంత్రాంగంలోని పలువురు అధికారులు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు.

భారత్-పాక్‌ మధ్య యుద్ధాన్ని అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేశారని, అలాగే రష్యా- ఉక్రెయిన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం వహించారని వైట్‌హైస్‌ మరోమారు వాదనకు దిగింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్.. గాజాలో శాంతి ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని, అతని ప్రయత్నాల కారణంగా పలువురు బందీలు విడుదలయ్యారని అన్నారు. ట్రంప్ ఆదేశాల దరిమిలా ఇరాన్‌లోని అణు సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర​్కొన్నారు.

‘మేము చాలా యుద్ధాలను ఆపాం. భారత్‌- పాకిస్తాన్‌లు అణ్వాయుధ దేశాలు. ఇవి పరస్పరం ఘర్షణపడుతున్నాయి. ఈ దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని నిలువరించాం. ఇటీవల ఇరాన్‌లో మేము ఏమి చేసామో  అందరూ చూశారు.  ఆ దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని ధ్వంసం చేశాం. భారత్‌- పాక్‌ మధ్య జరిగే యుద్ధాన్ని వాణిజ్యం ద్వారా పరిష్కరించామని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. అయితే భారత్‌-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడవ పక్షం ప్రమేయం లేదని భారత్‌ స్పష్టం చేసింది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)