Breaking News

అమెరికాలో టిక్‌టాక్‌ బాధ్యత ఒరాకిల్‌కు

Published on Tue, 09/23/2025 - 05:38

వాషింగ్టన్‌: అమెరికాలో సామాజిక మాధ్యమం టిక్‌టాక్‌ బాధ్యతలను ప్రముఖ టెక్‌ సంస్థ ఒరాకిల్‌ చేపట్టనుంది. అమెరికా వినియోగదారుల కోసం అవసరమైన అల్గారిథమ్‌ను త్వరలో టిక్‌టాక్‌ అందజేయనుంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్‌ సంభాషణ సందర్భంగా ఒప్పందం కుదిరినట్లు ఓ అధికారి వెల్లడించారు. 

చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌ కంపెనీ యాజమాన్యంలో టిక్‌టాక్‌ పనిచేస్తోంది. తాజా ఒప్పందంతో అమెరికాలోని టిక్‌టాక్‌ వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చైనా కంపెనీ తారుమారు చేసేందుకు అవకాశం ఉందనే ఆందోళనలకు చెక్‌ పడుతుందని భావిస్తున్నారు. 

ఈ ఒప్పందంలో సిల్వర్‌ లేక్‌ అనే ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ కూడా భాగస్వామిగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి అమ్మేయాలని లేదా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుందని బైట్‌డ్యాన్స్‌ను హెచ్చరిస్తూ డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన గత అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌..బైడెన్‌ విధించిన నిషేధం గడువును పలుమార్లు పొడిగించారు. టిక్‌టాక్‌తో చర్చలను సైతం కొనసాగించారు. తాజాగా, జిన్‌పింగ్‌తో ఫోన్‌ కాల్‌ సందర్భంగా దీనిపై ట్రంప్‌ ఒక అంగీకారానికి వచ్చారు. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)