Breaking News

కిరిబాటి.. కొత్త సంవత్సరం వచ్చేసిందోచ్‌!

Published on Tue, 12/31/2024 - 15:53

Happy New Year 2025: పాత ఒక రోత.. కొత్త ఒక వింత అంటే  బాగోదేమో.. కానీ పాత జ్ఞాపకాలని మదిలో దాచుకుంటూ కొత్త ఆశల్ని భుజానకెత్తుకోవడం అంటే సరిగ్గా సరిపోతుంది కదా. మరికొన్ని గంటల్లో యావత్‌ ప్రపంచం న్యూ ఇయర్‌  సెలబ్రేషన్స్‌ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతోంది.

అయితే ఇప్పటికే పలు దేశాల్లో కొత్త ఏడాది   ఉదయించింది’. ప్రపంచంలో అన్నింటికి కంటే ముందు సూర్యుడు ఉదయించే దేశాల్లో పసిఫిక్‌ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అందులో కిరిబాటి అనే ద్వీప దేశం ఒకటి. 

సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో ఆ భానుడి లేలేత కిరణాలు కిరిబాటి అనే చిన్న దేశం మీద ముందుగా పడతాయి. అంటే  ఈ దేశమే ముందు నిద్ర లేస్తుంది అన్నమాట. ఇదొక ద్వీప దేశం. దీని జనాభా చాలా తక్కువ.ఇక్కడ జనాభా 1.34 లక్షలు అని ఒక అంచనా. మన లెక్కన ఒక అసెంబ్లీ నియోజవర్గం ఓటర్ల సంఖ్య కంటే చిన్న దేశం ఇది. భారత్‌లో డిసెంబర్‌ 31(3.30 PM) సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ జనవరి 1వ తేదీ వచ్చేస్తుంది. భారత్‌కు కిరిబాటికి ఇంచుమించు 8.30 గంటల సమయం వ్యత్యాసం ఉంది.

 

భూమిపై ప్రకృతి సౌందర్యం, ప్రజలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో  ఇది ఒకటి.  ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల టాప్‌-10 జాబితాలో కూడా ఈ ద్వీప దేశానికి చోటు ఉండటం విశేషం.  ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉంది. 

భారత్‌లో ( 12 am అయిన సందర్భంలో)కొత్త ఏడాది ప్రారంభం కావడానికంటే ముందే  నూతన సంవత్సరం జరుపుకునే పలు దేశాల జాబితా వరుస క్రమంలో..

  • కిరిబాటి(8.30 am on Jan 1)

  • సమోవా, టోంగా((7.30 am on Jan 1)

  • న్యూజిలాండ్‌((7.30 am on January 1)

  • రష్యా, ఫిజి((6.30 am on January 1)

  • ఆస్ట్రేలియా((5.30 am on January 1)

  • పాపువా న్యూగినియా((4.30 am on January 1)

  • ఇండోనేషియా, జపాన్‌, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా( 1.30 am on January 1)

  • చైనా, మలేషియా, సింగపూర్‌(2.30 am on January 1)

  • వియాత్నాం, థాయ్‌లాండ్‌( 1.30 am on January 1)

  • మయన్మార్‌(1 am on January 1)

  • బంగ్లాదేశ్‌, కజికిస్తాన్‌, భూటాన్‌( 12.30 am on January 1)

  • నేపాల్‌(12.15 am on January 1)
     

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)