Breaking News

రూ. 6 లక్షల కోట్లు ఆవిరి : 58 ఏళ్ల చరిత్రలో ఇంత పతనం ఎన్నడూ లేదు!

Published on Wed, 07/15/2026 - 11:07

యూఎస్ టెక్ దిగ్గజం ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్, IBM) రెండో త్రైమాసిక ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో, మంగళవారం ఆ కంపెనీ షేర్లు ఏకంగా 25 శాతం పడిపోయాయి. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, గత 58 ఏళ్లలో ఐబీఎం చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన స్టాక్ పతనం. ఈ ఒకే ఒక్క రోజు క్రాష్ వల్ల కంపెనీ దాదాపు 67 బిలియన్ల నుండి 70 బిలియన్ల డాలర్ల మేర మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను (మార్కెట్ విలువను) కోల్పోయింది. అంటే దీని విలువ భారతీయ రూపాయలలో సుమారు  రూ. 6,73,228 కోట్లు (ఆరు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు).

ఏఐ బబుల్‌కి  బలైన తొలి , ప్రధాన సంస్థగా IBM నిలిచే అవకాశం ఉంది. కార్పొరేట్ టెక్నాలజీ వ్యయాల్లో వచ్చిన భారీ మార్పుల కారణంగా, సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ వ్యాపారాలపై AI సృష్టిస్తున్న ఒత్తిడికి  ఐబీఎం స్టాక్ పతనం అద్దం పట్టింది.  దీని ఫలితంగా, కేవలం 42 రోజుల్లోనే IBM షేర్‌ 35 క్షీణించింది. కంపెనీ మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్లకు(రూ. 9,61,800 కోట్లు)పైగా ఆవిరైపోయింది.

1911లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక కంపెనీ జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి కేవలం 1 శాతం వృద్ధితో 17.2 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని మాత్రమే నమోదు చేసింది. " తాజా ఫలితాల్లో నష్టాలు తప్పలేదు. మార్కెట్‌కు అనుగుణంగా తగినంత వేగంగా మారలేకపోయాము," అని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ పెట్టుబడిదారులకు రాసిన లేఖలో అంగీకరించారు.

స్టాక్ పతనానికి ప్రధాన కారణాలు
పరిశ్రమ అంతటా సరఫరా కొరత : ప్రస్తుత టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించుకోనే కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది. దీనివల్ల సర్వర్లు, మెమరీ చిప్స్, స్టోరేజ్ పరికరాలకు డిమాండ్ భారీగా పెరిగి, ధరలు ఎక్కువయ్యాయి. మార్కెట్లో వీటి కొరత కూడా ఏర్పడింది.

బడ్జెట్ మళ్ళింపు: జూన్ చివరి నాటికి, ధరలు మరింత పెరుగుతాయనే భయంతో ఐబీఎం కార్పొరేట్ క్లయింట్లు తమ బడ్జెట్‌ను సర్వర్లు, మెమరీ చిప్స్ కొనుగోలు చేయడానికి మళ్లించారు.

మెయిన్‌ఫ్రేమ్ బిజినెస్‌పై దెబ్బ: దీనివల్ల ఐబీఎంకు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే 'మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్లు' వాటి సాఫ్ట్‌వేర్ కొనుగోళ్లను క్లయింట్లు వాయిదా వేశారు. ఫలితంగా ఐబీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపార ఆదాయం 7 శాతం పడిపోయింది.

 సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు (Cybersecurity Concerns)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సైబర్ దాడులు మరింత అధునాతనంగా మారుతుండటంతో, కంపెనీలు తమ బడ్జెట్‌ను సైబర్ సెక్యూరిటీ వైపు మళ్లిస్తున్నాయి. ముఖ్యంగా యాంత్రోపిక్ (Anthropic) సంస్థ విడుదల చేసిన 'మైథోస్ ఏఐ' (Mythos AI) మోడల్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోని లోపాలను సులభంగా గుర్తిస్తోందని, దీనివల్ల హ్యాకర్లకు అవకాశం దొరుకుతుందని టెక్ పరిశ్రమ భయాందోళనలకు గురైంది. దీంతో క్లయింట్లు తమ మునుపటి ప్రాజెక్ట్‌లను పక్కన పెట్టి, సైబర్ రక్షణను బలోపేతం చేసు కోవడంపై దృష్టి పెట్టారు. ఈ పరిణామంతో క్రౌడ్‌స్ట్రైక్ (CrowdStrike), ఆక్టా (Okta), నెట్‌స్కోప్ (Netskope) వంటి సైబర్ సెక్యూరిటీ కంపెనీల షేర్లు 11 నుండి 12 శాతం వరకు పెరిగాయి.

భవిష్యత్తుపై ప్రశ్నలు
ఐబీఎం షేర్ల పతనం సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ సంస్థల (SaaS - Software as a Service) భవిష్యత్తుపై సరికొత్త చర్చకు దారి తీసింది. ఐబీఎంతో పాటు సేల్స్‌ఫోర్స్ (Salesforce), అడోబ్ (Adobe), ఇంటూయిట్ (Intuit) కంపెనీల షేర్లు కూడా మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఏఐ మోడల్స్ సాధారణ వినియోగదారులకు కూడా సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలను అందించగలవని, దీనివల్ల ఈ రకమైన సాఫ్ట్‌వేర్ రంగానికి ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు (దీనిని వాల్ స్ట్రీట్ 'సాస్-పోకలిప్స్'గా పిలుస్తుంది) మళ్లీ తెరపైకి వచ్చాయి.

ఇదీ చదవండి: "హలో..నేను దివ్య మాట్లాడుతున్నాను": కట్‌ చేస్తే..రూ. 21 కోట్ల స్కాం

ఐబీఎంకు ఆశాజనకమైన అంశాలు
ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్ విక్రయించే ఐబీఎం అనుబంధ సంస్థ రెడ్ హ్యాట్ (Red Hat) 11 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.మెయిన్‌ఫ్రేమ్‌లు మినహా, కంపెనీకి చెందిన ఇతర సర్వర్ మరియు స్టోరేజ్ వ్యాపారం 37 శాతం వృద్ధి చెందింది. ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్‌లలోని లోపాలను సరిదిద్దడానికి ఐబీఎం  5 బిలియన్‌ డాలర్ల వ్యయంతో 'లైట్‌వెల్' (Lightwell) అనే కొత్త చొరవను ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీమోర్గాన్ చేజ్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి ప్రముఖ బ్యాంకులు  దీనికి మద్దతు ఇస్తున్నాయి.

ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

#

Tags : 1

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)