Breaking News

Trump: చేతిపై కమిలిన గాయాలు.. కాళ్లు ఈడ్చుకుంటూ..!

Published on Tue, 03/04/2025 - 15:51

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉంటే ఆయన ఆర చేతిపై చర్మం కమిలిన గుర్తులు ఎందుకు ఉన్నట్లు? కాళ్లు ఈడ్చుకుంటూ ఎందుకు నడుస్తున్నారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.    

డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం మధ్యాహ్నం శ్వేతసౌధంలో తైవాన్‌ సెమీకండక్టర్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ కంపెనీ (టీఎస్‌ఎంసీ)గురించి మాట్లాడారు. మాట్లాడే సమయంలో ఆయన ఎడమ చేయి అరచేతిలో రెండు చోట్ల చర్మం ఎర్రగా కమిలిన గుర్తులు కనిపించాయి. మంగళవారం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో రెండో సారి కుడి చేయి పైభాగంలో అలాంటి గుర్తులే ఉన్నాయి. గతవారం ప్రపంచాది నేతలతో జరిగిన సమావేశంలో ట్రంప్‌ చేతిపై ఇదే తరహాలో గుర్తులు కనిపించాయి.

అంతేకాదు, కాళ్లు ఈడ్చుకుంటూ ట్రంప్‌ నడుస్తున్న వీడియోలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల్లో అమెరికా అధ్యక్షుడు తన గోల్ఫ్ కార్ట్‌లో (వాహనం) నుండి ఇబ్బంది పడుతూ దిగారు. వాహనం నుంచి దిగిన తర్వాత కాళ్లు ఈడ్చుకుంటూ, కొన్ని సెకన్ల పాటు వణుకుతున్నట్లు కనిపించారు. 

ట్రంప్‌ చర్మంపై కమిలిన గుర్తులతో పాటు కాళ్లు ఈడ్చుకుంటూ నడుస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో కావడంతో ట్రంప్‌ ఆరోగ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆ గుర్తులపై స్పందిస్తూ నెటిజన్లు.. ట్రంప్‌ డైమన్షియా సమస్యతో బాధపడుతున్నారని ఒకరంటే.. ట్రంప్‌కు ఆనారోగ్య సమస్యలు తలెత్తాయిని మరొకరు కామెంట్లు  చేస్తున్నారు.

అయితే, ట్రంప్‌ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని వైట్‌ హైస్‌ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఖండించారు. అధ్యక్షునికి అనారోగ్య సమస్యలు లేవని,ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ‘అధ్యక్షుడు ప్రజల మనిషి. అతని నిబద్ధత తిరుగులేనిది. ఆయన చేతిపై గాయాలున్నాయి. ఎందుకంటే ఆయన నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. కరచాలనం చేస్తున్నారు. ఫలితంగా ట్రంప్‌ చేయి కమిలిందని అన్నారు. కాళ్లు ఈడ్చుకుంటూ ఎందుకు నడుస్తున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)