Breaking News

సర్జరీ లేకుండా పేస్‌మేకర్‌

Published on Sun, 07/12/2026 - 04:59

గుండె సమస్యలకు చెక్‌ పెట్టి అది సక్రమంగా కొట్టుకునేలా చేసేందుకు వాడే పేస్‌మేకర్‌ అమర్చేందుకు ఇక శస్త్రచికిత్స అవసరం లేదు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అల్ట్రాసౌండ్‌తోనే పనిచేసే పేస్‌మేకర్‌ ఒకదాన్ని అభివృద్ధి చేయడం ఇందుకు కారణం. 

సూక్ష్మస్థాయి అల్ట్రాసౌండ్‌ ట్రాన్స్‌డ్యూసర్లు కలిగి ఉండే ఈ సరికొత్త పేస్‌మేకర్‌ను ఛాతీపై ఎడమవైపు రొమ్ము కింది భాగంలో అతికించుకుంటే చాలు గుండె ఎలక్ట్రికల్‌ సిగ్నళ్ల సమస్యలు, కొట్టుకునే పద్ధతిలో తేడాలను సరిచేయవచ్చు. అయితే ఈ పేస్‌మేకర్‌ విడుదల చేసే అ్రల్టాసౌండ్‌ సంకేతాలను గుర్తించేందుకు గుండె కణాలు కొన్నింటిని ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. 

‘ఎంఎస్‌సీఎల్‌జీ22ఎస్‌’పేరున్న అయాన్‌ ఛానల్‌తో గుండె కణాల్లో మార్పులు చేసి రక్తం లేదా నేరుగా గుండె కండరాలకు అందజేస్తారు. ఈ కణాలు అ్రల్టాసౌండ్‌ సంకేతాలకు స్పందించి గుండె ఒక క్రమ పద్ధతిలో కొట్టుకునేలా చేస్తుంది. శబ్ధం(అ్రల్టాసౌండ్‌), జెనిటిక్స్‌(కణాల్లో మార్పులకు) రెండింటినీ ఉపయోగిస్తున్నందున ఈ పద్ధతికి సోనోజెనిటిక్స్‌ అని పేరు. ఇంకోలా చెప్పాలంటే గుండె కణాలు శబ్దాన్ని వినేలా చేస్తారు.

 ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించి సత్ఫలితాలు సాధించారు. అ్రల్టాసౌండ్‌ శబ్ధాలకు గుండె కణాలు ఒక క్రమ పద్ధతిలో కొట్టుకున్నాయి. జంతువుల్లోనూ గుండె పనితీరు మెరుగైనట్లు గుర్తించారు. ఎలుకలు, పంది గుండెలకు అమర్చిన ఈ సరికొత్త పేస్‌మేకర్లు ఎనిమిది నెలలపాటు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పనిచేశాయి. మరిన్ని పరీక్షల ద్వారా ఫలితాలను నిర్ధారించుకుంటే మరికొన్నేళ్లలోనే పేస్‌మేకర్‌ అమర్చేందుకు శస్త్ర చికిత్స చేయాల్సిన శ్రమ తప్పిపోనుంది.      

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)