Breaking News

హర్మూజ్‌ జలసంధిపై.. ట్రంప్ కీలక ప్రకటన

Published on Tue, 03/10/2026 - 18:54

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంటుందని ప్రకటించారు. ఇదే జరిగితే చమురు సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది.

పశ్చిమాసియాలో పరిస్థితులు నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ ఏ మాత్రం తగ్గకుండా అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతుంది. గల్ఫ్ కంట్రీస్‌లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులు చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా హర్మూజ్ జలసంధిని ఆధీనంలోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ముడిచమురు రవాణాలో 20 శాతం వరకూ ఈ మార్గం మీదుగానే రవాణా అవుతుంది. దీనిని ఇరాన్‌ బ్లాక్ చేసింది. నౌకలు కదిలితే పేల్చేస్తామని హెచ్చరించింది. దీంతో భారత్‌తో పాటు చాలా దేశాలకు ముడిచమురు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికసంక్షోభం తలెత్తే అవకాశం తలెత్తే అవకాశం ఉందని పలు సంస్థలు హెచ్చరించాయి.ఈ నేపథ్యంలోనే ట్రంప్ హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా తలెత్తిని చమురు సంక్షోభానికి పులిస్టాప్ పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అమెరికా స్థావరాలపై దాడులు తీవ్రతరం చేస్తున్న ఇరాన్‌.. హర్మూజ్‌ను స్వాధీనం చేసుకుంటే మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఈ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)