Breaking News

భారత్‌తో యుద్ధం చేస్తాం: పాక్ రక్షణ మంత్రి

Published on Thu, 11/13/2025 - 14:00

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తలబిరుసు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ అటు భారత్, ఇటు ఆఫ్గానిస్థాన్ రెండు దేశాలతో ఏక కాలంలో యుద్ధం చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. పాకిస్థాన్ లో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ (khawaja asif) అంటేనే వివాదాస్పద వ్యాఖ్యలకు, ఉత్తుత్తి మాటలకు పెట్టింది పేరు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైతం భారత్‌పై ఎన్నో సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన పాకిస్థాన్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ పడమర దిక్కున భారత్‌తో, తూర్పు దిక్కున అఫ్గానిస్తాన్‌తో ఏకకాలంలో యుద్ధం చేయడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు. 

''తొలిరౌండ్‌లో అల్లా మాకు సహాయం చేశారు. రెండో రౌండ్‌లోనూ ఆయన మాకు అండగా ఉంటార''ని తెలిపారు. కాబూల్‌లోని పాలకులు తలచుకుంటే పాకిస్థాన్ లోని టెర్రరిజాన్ని ఆపవచ్చు కానీ వారు అలా చేయడం లేదని.. దీనికి తగిన రీతిలో బదులిస్తామని హెచ్చ‌రించారు. మంగళవారం పాకిస్థాన్‌లో జరిగిన బాంబుదాడిలో 12 మంది మరణించారు. అది తమ చర్యేనని పాకిస్థాన్ తాలిబన్ గ్రూప్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఖండించిన భార‌త్‌
అయితే ఖవాజా తాజా వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆసిఫ్ తన వ్యాఖ్యలతో పరిస్థితుల నుంచే తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన స్వరం ఇస్లామాబాద్ భయాన్ని తెలియజేస్తోందన్నారు. ఇటీవల భారత్ లో జరిగిన ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ విషయంలో సైతం ఖవాజా ఆసిఫ్ తలబిరుసుగా మాట్లాడారు. ఆ ప్రమాదం గ్యాసు లీకు వల్ల జరిగిందని, ఆ దాడిని భారత్ రాజకీయం చేస్తోందని వ్యాఖ్యానించారు. పేలుడు పదార్థాల వల్లే ఎర్రకోట కారు పేలుళ్లు జరిగాయని ఫోరెన్సిక్ నివేదికలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)