అమెరికా ఎన్నికల సర్వేలో సూపర్‌ ట్విస్ట్‌.. లీడ్‌లోకి ట్రంప్‌!

Published on Fri, 10/25/2024 - 08:17

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఎన్నికలు గెలుపు ఎవరిది? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. విజయం కోసం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇద్దరు అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ మద్దతు కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై సర్వేలు ఆసక్తికర ఫలితాలను వెల్లడిస్తున్నాయి.

అగ్ర రాజ్యం అమెరికాలో నవంబర్‌ 5వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ మధ్య ఆధిపత్యంపై వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ చేపట్టిన సర్వేలో కీలక విషయాలను వెల్లడించింది.  వీరిద్దరి మధ్య స్వల్ప తేడాతో పోటీ కొనసాగుతోందని స్పష్టం చేసింది. తాజా సర్వే ప్రకారం..  ట్రంప్‌నకు 47 శాతం, హారీస్‌కు 45 శాతం మంది ఆదరణ ఉన్నట్టు తెలిపింది. సర్వే మార్జిన్‌ ప్లస్‌ లేదా మైనస్‌ 2.5 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో​, ట్రంప్‌ లీడ్‌లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడం ఇద్దరు అభ్యర్థులు స్వరం పెంచారు. తాజాగా ట్రంప్‌పై కమల విరుచుకుపడ్డారు. ట్రంప్‌ అసమర్థుడని, అధ్యక్ష పదవికి కరెక్ట్‌ కాదని.. ఆయనో నియంత అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో  రాజ్యాంగానికి కట్టుబడి ఉండే సైన్యం ట్రంప్‌కు నచ్చదు. అమెరికా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ఆయన చేసిన ప్రతిజ్ఞను గతంలో ఉల్లంఘించారు. గత వారమే తన సహచర అమెరికన్లను అంతర్గత శత్రువులుగా పేర్కొన్నారు అంటూ మండిపడ్డారు. ఇక, తనపై ఆరోపణలకు ట్రంప్‌ కౌంటరిచ్చారు. ఎన్నికల్లో ఒక వేళ కమలా హారీస్‌ గెలిస్తే.. అమెరికాలో చైనా ఆడుకుంటుంది. ఆమెకు చిన్న పిల్లను చేసి జిన్‌పింగ్‌ గేమ్‌ ఆడుకుంటారని సెటైర్లు వేశారు. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)