Breaking News

ఉక్రెయిన్‌ సేనలకు పుతిన్‌ హెచ్చరిక.. మీ ప్రాణాలకు గ్యారంటీ లేదంటూ..

Published on Sat, 03/15/2025 - 08:52

మాస్కో: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న వేళ అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరికలు జారీ చేశారు. కర్క్స్‌ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోవడం మంచిది. లేకపోతే వారు ప్రాణాలతో ఉండరు అని వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో, మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భాగంగా పశ్చిమ రష్యాలోని కర్క్స్‌లో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్‌ సేనలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌ ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా పుతిన్‌ తాజాగా మాట్లాడుతూ..‘కర్క్స్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్‌ (Ukraine) సేనలు లొంగిపోతే వారు ప్రాణాలతో ఉంటారు. ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే వారి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వగలను. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. రష్యా ఫెడరేషన్‌తో పాటు అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాం. మానవతా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ట్రంప్‌ పిలుపు నాకు అర్థమైంది. ఆయన సూచన మేరకు ఓ విషయాన్ని వెల్లడిస్తున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, పుతిన్‌ వ్యాఖ్యలపై ఉక్రెయిన్‌ సేనల్లో టెన్షన్‌ మొదలైనట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ను కనికరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు తాను విజ్ఞప్తి చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. యుద్ధంలో ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కీవ్‌ సేనలను అన్ని వైపుల నుంచి రష్యా దళాలు చుట్టుముట్టాయని తెలిపారు. అందుకే.. ఉక్రెయిన్‌ సైనికులపై కనికరం చూపాలని తాను పుతిన్‌కు విజ్ఞప్తి చేశానని చెప్పారు. లేకపోతే రెండో ప్రపంచయుద్ధం తర్వాత జరిగే అతి దారుణమైన ఊచకోతగా ఇది మిగిలిపోతుందని అన్నారు. కాల్పుల విరమణకు సంబంధించి రష్యా నుంచి మంచి సంకేతాలు వస్తున్నాయని, మాస్కోతో జరిపిన చర్చలు ఫలించే అవకాశం ఉందన్నారు. యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నానని పుతిన్‌ చేసిన ప్రకటనపై ట్రంప్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)