Breaking News

నరేంద్ర మోదీ బిగ్‌ ఫ్రెండ్‌

Published on Sat, 07/01/2023 - 05:37

మాస్కో:  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు(బిగ్‌ ఫ్రెండ్‌) అని పేర్కొన్నారు. మోదీ కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తోందని కొనియాడారు. గురువారం మాస్కోలో ఏజెన్సీ ఫర్‌ స్ట్రాటెజిక్‌ ఇనీíÙయేటివ్స్‌(ఏఎస్‌ఐ) కార్యక్రమంలో పుతిన్‌ మాట్లాడారు.

మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనం కాకపోయినా, మన స్నేహితుడు చేసిన పని సత్ఫలితాలు ఇస్తుంటే అనుకరించడంలో తప్పేమీ లేదన్నారు. స్థానికంగా తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారత నాయకత్వం ప్రభావవంతమైన విధానాలను సృష్టిస్తోందని, విదేశీ పెట్టుబడిదారులను అమితంగా ఆకర్శిస్తోందని చెప్పారు. పుతిన్, నరేంద్ర మోదీ చివరిసారిగా 2022 సెపె్టంబర్‌లో ఉజ్బెకిస్తాన్‌లో ఓ సదస్సు సందర్భంగా కలుసుకున్నారు.    

ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలు బలోపేతం చేసుకుందాం
తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు శుక్రవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నారు. కీలక రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని ఇరువురూ సమీక్షించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

రెండు దేశాల నడుమ వ్యాపార, వాణిజ్యాల విలువ నానాటికీ పెరుగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో ఘర్షణ ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశమని, దౌత్య మార్గాల్లో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఉక్రెయిన్‌ నాయకత్వం అందుకు అంగీకరించడం లేదని మోదీకి పుతిన్‌ తెలియజేశారు. వివాదాలకు తెరదించడానికి దౌత్య ప్రయత్నాలు, చర్చలే మార్గమని మోదీ పునరుద్ఘాటించారు. మోదీ, పుతిన్‌ మధ్య అర్థవంతమైన, నిర్మాణాత్మక సంభాషణ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)