Breaking News

Vivek Ramaswamy: పాదరక్షలు లేకుండా ఇంటర్వ్యూ.. ట్రోలింగ్‌ బారిన వివేక్‌ రామస్వామి

Published on Sun, 03/02/2025 - 12:06

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇటీవల చెప్పులు లేకుండా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి. వీటిని చూసిన కొందరు  రామస్వామిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆయనను అమెరికన్ వ్యతిరేకి అని, మొరటువాడని వ్యాఖ్యానిస్తున్నారు.  కొందరైతే  వివేక్ రామస్వామికి మద్దతు పలుకుతున్నారు. 

గత ఏడాది వివేక్ రామస్వామి ఒక లైవ్ స్ట్రీమింగ్ రికార్డింగ్(Live streaming recording) సమయంలో చెప్పులు లేకుండా ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ రికార్డింగ్ వివేక్ రామస్వామి ఇంట్లో జరిగింది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది. కొందరు  ‘వివేక్ రామస్వామి ఎప్పటికీ ఒహియో గవర్నర్ కాలేరు’ అని వ్యాఖ్యానించగా, మరికొందరు ‘అమెరికాలో ఇది ఆమోదయోగ్యం కాదని’ అన్నారు. మరికొందరు ‘ఇంటర్వ్యూ సమయంలో వివేక్ కనీసం సాక్స్ అయినా ధరించి ఉండాల్సిందని’ పేర్కొన్నారు. మరొక యూజర్ ‘వివేక్ రామస్వామి విద్యాభివృద్ధిపై ఉపన్యాసాలు ఇస్తారని, అయితే ఇంటర్వ్యూలో చెప్పులు లేకుండా  కనిపించారని, ఇది చాలా అసభ్యకరమైనదని’ వ్యాఖ్యానించారు.

వివేక్ రామస్వామికి సోషల్‌ మీడియాలో మద్దతు పలికినవారు కూడా ఉన్నారు. భారతదేశంతో పాటు దక్షిణ, తూర్పు ఆసియాలో ఇంట్లో పాదరక్షలు(Footwear) తొలగించడం సర్వసాధారణమని కొందరు కామెంట్‌ బాక్స్‌లో రాశారు. దాదాపు భారతీయులంతా తమ ఇళ్లలో చెప్పులు లేకుండా  ఉంటారని ఒక యూజర్‌ పేర్కొన్నారు. ఇందులో తప్పేమీ లేదని, ఇది అక్కడి సంస్కృతిలో భాగమని పేర్కొన్నవారు కూడా ఉన్నారు.  అయితే వివేక్‌ రామస్వామి ఈ చర్చకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: చెఫ్‌ అవతారంలో సోనూసూద్‌.. దోశ రేటు రెట్టింపు చేసి..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)