Breaking News

కమలా హారీస్ ఓ‌ కీలుబొమ్మ: వివేక్‌ రామస్వామి

Published on Fri, 08/23/2024 - 07:41

చికాగో: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను టార్గెట్‌ చేస్తూ రిపబ్లిక్‌ పార్టీ నేత వివేక్‌ రామస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కమలా హారీస్‌ కీలుబొమ్మ అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో అమెరికా ప్రజలు వాస్తవాలను గ్రహించాలని కోరారు.

కాగా, వివేక్‌ రామస్వామి తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కమలా హారీస్‌ ఓ కీలుబొమ్మ. చక్రంలో ఇరుక్కున్న ఓ పిల్లి వంటి వ్యక్తి ఆమె. ఇక్కడ వాస్తవం ఏమిటంటే.. అమెరికా విధానాలకు ఆమె ఎంతో దూరంగా ఉన్నారు. ఆమెకు ప్రజాదరణ చాలా తక్కువ. అది మాకు ఎంతో కలిసి వస్తుంది. ఎన్నికల్లో మేము తప్పకుండా విజయం సాధిస్తాం. ఆమె ఆర్థిక విధానాలు విఫలయమ్యాయి. మేము పాలసీలో గెలుస్తాము. 

ఈ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే పది మిలియన్ల మందికి సరిహద్దును తెరిచి ఉంచడం అమెరిక్లను ఎంతో అభ్యంతరకరం. దేశ సరిహద్దుల విషయంలో భద్రతకు మేము కట్టుబడి ఉన్నాము. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా సరైన ఎంపిక అని నేను భావిస్తున్నాను. ట్రంప్‌ విజయం సాధించేందుకు మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం . సెనేట్ మరియు హౌస్‌పై కూడా మాకు నియంత్రణ ఉంటేనే మేము ఆ ఎజెండాను అమలు చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చారు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)