Breaking News

అమెరికన్లు పిల్లల్ని తప్పుడు మార్గంలో పెంచుతున్నారు: వివేక్‌ రామస్వామి

Published on Sat, 12/28/2024 - 07:19

వాషింగ్టన్‌: భారత్‌ వంటి దేశాల నుంచి నిపుణులైన సిబ్బందిని నియమించుకోవడాన్ని పూర్తిగా ఆపేయాలంటూ మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌) వేదిక మళ్లీ డిమాండ్‌ చేస్తున్న వేళ.. భారతీయ అమెరికన్‌ వ్యాపార వేత్త, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన వివేక్‌ రామస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. అమెరికా అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ భారతీయ అమెరికన్‌ వెంచర్‌ కేపిటలిస్ట్‌ శ్రీరాం కృష్ణన్‌ను కృత్రిమ మేథ సీనియర్‌ విధాన సలహాదారుగా ఇటీవల నియమించడం తెలిసిందే. ఈ నియామకంపై మాగా వేదిక విమర్శలు గుప్పిస్తోంది. 

ఇలాంటి చర్యలు అమెరికా ఫస్ట్‌ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తాయని అంటోంది. ఇమిగ్రేషన్‌ విధానాల వల్లే అమెరికన్లకు అవకాశాల్లేకుండా పోతున్నాయని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే, వివేక్‌ రామస్వామి మరో కోణంలో చేస్తున్న వాదించారు. అసలు సమస్య ఇమిగ్రేషన్‌ విధానాల్లో లేదని, అమెరికా సంస్కృతిలో పిల్లల పెంపకంలో లోపమే కారణమంటూ ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు. అమెరికన్‌ యువతలో సహజంగానే నైపుణ్యం ఉందని, అయితే దానిని పెంపొందించడంలో వ్యవస్థాగతంగా విఫలమైందన్నారు. 

గణిత మేధావులు, ఉన్నత విద్యావంతులను వదిలేసి అలంకార పదవుల్లో ఉన్న వారిని పొగుడుతుండటమనే సంస్కృతే ఇందుకు కారణమన్నారు. అదే సమయంలో, వలసదారుల కుటుంబాలు తమ పిల్లలను విద్యారంగంలో నిష్ణాతులుగా మార్చి, క్రమశిక్షణతో పెంచుతున్నాయని తెలిపారు. సామాజిక కార్యక్రమాలు, టీవీ వీక్షణం వంటివాటిపైనా ఆంక్షలు పెడుతుంటాయన్నారు. ఫలితంగా ఈ కుటుంబాల నుంచి నాయకులు తయారవడం మామూలేనన్నారు. ఈ వ్యాఖ్యలపై మాగా వేదిక భగ్గుమంది. వలసదారులకు, హెచ్‌–1బీ వీసాదారులకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ వివేక్‌ రామస్వామిపై 
ఎదురుదాడికి దిగింది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)