Breaking News

ట్రంప్‌పై కాల్పులు.. వివేక్‌రామస్వామి సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 07/14/2024 - 15:25

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీద జరిగిన హత్యాయత్నం ఘటనపై భారత సంతతికి చెందిన బిలియనీర్‌, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడ్డ నేత వివేక్‌ రామస్వామి ఎక్స్‌(ట్విటర్‌)లో తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌పై కాల్పులు జరగడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు.

అధ్యక్ష ఎన్నికల పోటీలో లేకుండా చేయడం కోసమే ట్రంప్‌ను చంపాలని చూశారని ఆరోపించారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందన కూడా సరిగాలేదని వివేక్‌రామస్వామి విమర్శించారు.

‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎలాంటివాడన్నది ఈ ఘటనతో తెలిసింది. ఈ ఘటనలో జరిగిన మంచి ఇదొక్కటే. బుల్లెట్‌ తాకినా,రక్తం కారుతున్నా..ట్రంప్‌ ప్రజల కోసమే నిలబడ్డాడు.నాయకత్వం వహించేందుకు సిద్ధమని స్పష్టం చేశాడు’అని రామస్వామి ట్రంప్‌ను కొనియాడారు. ఓటర్లు ఎవరికి ఓటేద్దామనుకుంటున్నప్పటికీ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని మాత్రం ఖండించాల్సిందేనని పిలుపునిచ్చారు.

కాగా,శనివారం(జులై 13) పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్‌ ఎడమచెవికి బుల్లెట్‌ గాయాలయ్యాయి.ఈ ర్యాలీకి హాజరైన ట్రంప్‌ మద్దతుదారుడు ఒకరు కాల్పుల్లో మృతిచెందాడు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)