Breaking News

వీసా అర్హతే.. హక్కుకాదు! 

Published on Thu, 07/17/2025 - 05:51

వాషింగ్టన్‌: అమెరికా వీసా దక్కడం అనేది చట్టబ ద్ధమైన హక్కు కాదని, అది కేవలం అమెరికాలోకి అడుగుపెట్టేందుకు అర్హత మాత్రమేనని ట్రంప్‌ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. వీసా దర ఖాస్తులదారులను హెచ్చరిస్తూ ఇప్పటికే పలు మార్లు పలురకాల అడ్వైజరీలు జారీచేసిన ట్రంప్‌ సర్కార్‌ తాజాగా మరో ప్రకటనను విడుదలచేసింది. 

దరఖాస్తుదారుల సామాజికమాధ్యమ ఖాతాల్లో గత వ్యాఖ్యానాలు, వీడియోలు, పోస్ట్‌లను జల్లెడపట్టి వెతికిమరీ అప్లికేషన్లను ప్రభుత్వం బుట్ట దాఖలుచేయడం తెల్సిందే. తాజాగా వీసా పొంది అమెరికా గడ్డపై అడుగుపెట్టాక చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వీసాను వెంటనే రద్దుచేసి, బహిష్కరించి బలవంతంగా స్వదేశానికి పంపుతామని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ అమెరికాలో ఉంటూ ఇతరులపై దాడికి పాల్పడటం, గృహ హింస, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడితే వెంటనే వీసా గడువును రద్దుచేసి దేశం నుంచి బహిష్కరిస్తాం. 

భవిష్యత్తులో మరోసారి అమెరికాకు రాకుండా శాశ్వతంగా నిషేధిస్తాం. మీరు అతిక్రమిస్తే ప్రభుత్వం సైతం వీసా గడువును ముగించి మిమ్మల్ని దేశం నుంచి వెళ్లగొడుతుంది’’ అని అమెరికా విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో స్పష్టంచేసింది. ‘‘వీసా పొందిన మీరు చట్టబద్ధంగా అమెరి కాలో ఉండేందుకు అర్హులు. ఆ సువర్ణావకాశాన్ని ఒక్క తప్పుతో చేజార్చుకోకండి. ఒక్క చిన్న నేరం చేసినా మీరు వీసా విషయంలో శాశ్వత విపరి ణామాలను చవిచూడాల్సి ఉంటుంది. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్క సందర్శకుడు మా చట్టాల ను గౌరవించి తీరాల్సిందే’’ అని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)