Breaking News

పెయింటింగ్‌ అనుకుంటున్నారా?.. అస్సలు కాదండోయ్‌.. మరేంటి!

Published on Wed, 09/07/2022 - 09:40

ఈ ఫొటో చూశారా? చేయి తిరిగిన రెజిన్‌ ఆర్టిస్ట్‌ గీసిన రంగురంగుల హరివిల్లులా ఉంది కదూ! కానీ, ఇది పెయింటింగ్‌ కాదు.. ఫొటోగ్రాఫ్‌. వాషింగ్టన్‌లో ఉన్న మౌంట్‌ రైనర్‌ నేషనల్‌ పార్క్‌లోని ఓ మంచు గుహలో తీసిన చిత్రం. మంచుకు అన్ని రంగులెలా వచ్చాయంటే... ఆ గుహకు ఉన్న ఒక ద్వారం గుండా సూర్యరశ్మి లోపలికి ప్రవేశించి, మంచుపై పడి ఇలా ప్రతిఫలిస్తుందన్నమాట. వీటిని చూడటానికి పర్యాటకులు, ఫొటోగ్రాఫర్స్‌ ఆసక్తి చూపిస్తుంటారు. నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ అధికారులు మాత్రం అది ప్రమాదమని ప్రవేశాన్ని నిషే­దించారు. ‘

‘నిత్యం కరుగుతోన్న ఆ మంచు గుహలు ఎప్పుడైనా విరిగిపడొచ్చు. అత్య­ల్ప ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల.. లోపలికి వెళ్లినవాళ్లకు ఊపిరి అందకుండా పోయే ప్రమాదమూ ఉంది’’ అని హెచ్చరించారు. మంచు కరిగి ప్రవహిస్తున్న నీటిపాయ గుహ రాళ్ల మధ్య కనిపిస్తోంది కదా! నిజానికి ఒకప్పుడు ఈ పార్కు మంచు గుహలకే ప్రత్యేకం. కానీ.. వాతావరణంలో వస్తున్న మార్పులతో కరిగి అం­తరించి పోతున్నాయి. కరిగిన మంచు చిన్నపాటి కారు సైజులో విరిగి పడుతుండటంతో ప్రమాదమని 1980లోనే గుహలను మూసేశారు. అయితే ప్రాణాలకు తెగించి తీసిన ఫొటోలను ఫోటోగ్రాఫర్‌ మాథ్యూ నికోల్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా, అవి వైరలవుతున్నాయి.  

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)