Breaking News

Pakistan: నిరసన ప్రదర్శనలకు పీటీఐ పార్టీ స్వస్తి

Published on Wed, 11/27/2024 - 12:42

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని అధికార షాబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నేతలు, కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధ​ంయలో ఈ నిరసనలను అణచి వేసేందుకు ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు నిరసన ప్రదర్శనలు హింసాత్మక ఘటనలకు దారితీయడంతో పీటీఐ పార్టీ ఆందోళనలకు స్వస్త పలుకుతున్నట్లు ప్రకటించింది.  

పీటీఐ నిసరనల నేపధ్యంలో రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌తో ఆ పరిసర ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేధ్యంలో పాక్‌ భద్రతా సిబ్బంది కఠిన చర్యలు చేపట్టారు. దీంతో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు నిరసనలు విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తదుపరి వ్యూహం ఏమిటనేది పార్టీ ఇంకా వెల్లడించలేదు.  భద్రతా సిబ్బంది చేపట్టిన చర్యలను పీటీఐ ‘ఫాసిస్ట్ మిలిటరీ పాలన’ చేపట్టిన జాతి నిర్మూలన ప్రయత్నంగా అభివర్ణించింది.

ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న 450 మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.  పీటీఐ నేతలు మీడియాతో మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశ్యంతోనే భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరిపాయని ఆరోపించారు. పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా షాబాజ్-జర్దారీ-అసిమ్ కూటమి నేతృత్వంలో భద్రతా దళాలు మారణహోమం కోసం ప్రయత్నించాయని పీటీఐ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. గత ఏడాది ఆగస్టు నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాణ్‌ నవంబర్ 24న దేశవ్యాప్త నిరసనలకు చివరి పిలుపునిచ్చారు. 

ఇది కూడా చదవండి: తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం'

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)