Breaking News

బ్యాటరీ రీచార్జ్‌.. భిక్షాందేహీ...!

Published on Tue, 07/07/2026 - 18:54

ఆకలేస్తుంది కాస్త అన్నం పెట్టండి.. జాలి చూపి ఓ పది రూపాయలు దానం చేయండి.. ఇవీ రోడ్లపై బిచ్చగాళ్ల వేడుకోళ్లు. చిల్లర లేదు అనే సాకు లేకుండా వీరు కూడా క్యూఆర్‌ కోడ్‌ తగిలించుకుని మరీ అడుక్కుంటున్నారనే సంగతి పక్కన పెడితే.. నా బ్యాటరీ అయిపోయింది.. రీచార్జ్‌కు సాయం చేస్తారా?.. కొంచెం డబ్బులిస్తే కరెంటు బిల్లు కట్టుకుంటా అనడిగే విచిత్ర యాచకులెవరినైనా చూశారా? అయితే పదండి చైనా వీధుల్లోకి..  

బీజింగ్, చెంగ్డూ, ఫుజౌ వంటి ప్రముఖ నగరాల్లో మోకాళ్లపై కూర్చుని, చేతులు జోడిస్తున్న భంగిమల్లో క్యూఆర్‌ కోడ్‌లు పెట్టి మరీ యువాన్లు దానం చేయాలంటూ ప్రాధేయపడుతున్నది మామూలు మనుషులు కాదు.. హ్యూమనాయిడ్‌ రొబోట్లు. హాంకాంగ్‌కు చెందిన హెచ్‌కే01 అనే న్యూస్‌ వెబ్‌సైట్‌ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనాలో పలు చోట్ల ఈ మరమనుషులు కనిపించాయట. దారిన వెళ్లేవాళ్లు ఈ విచిత్రం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

కొందరు నిజంగానే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి డబ్బులు పంపుతుంటే మరికొందరు వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. అయితే నిజంగానే డబ్బుల కోసమే వీటిని రోడ్డుకెక్కించారా? లేదా భవిష్యత్తులో ఏఐ సృష్టించబోయే సునామీని కళ్లకు కట్టే ప్రతీకాత్మక ప్రదర్శనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే యూనిట్రీ వంటి ప్రముఖ సంస్థలు రూపొందిస్తున్న అత్యంత అధునాతన జీ1, హెచ్‌2 వంటి హ్యూమనాయిడ్‌ రొబో మోడళ్లు చాలా ఖరీదు. అలాంటి వాటిని ఈ పనుల కోసం వినియోగించడం ఆర్థికంగా అంత గిట్టుబాటయ్యే విషయమేమీ కాదని, ఇది తప్పకుండా ఒక కొత్త రకమైన మార్కెటింగ్‌ టెక్నిక్‌ లేదా పబ్లిసిటీ స్టంట్‌ అయిఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

చ‌ద‌వండి: హ‌మాస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏఐ ఏజెంట్లు, ఏఐ–ఆధారిత రోబోలు జీవితంలో ఓ భాగంగా మారిపోతున్న కాలం ఇది. ఇప్పటిదాకా ఆఫీసులు, ఇళ్లకే పరిమితమైన ఈ హ్యూమనాయిడ్‌ రోబోలు.. దుఃఖం, జాలి వంటి భావోద్వేగాలనుకూడా భర్తీ చేయడం మొదలుపెడితే.. పరిస్థితులు ఎలా ఉంటాయో కదూ?
– సాక్షి సెంట్రల్‌డెస్క్‌ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)