Breaking News

Video: చీరకట్టు, స్మార్ట్‌ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్‌..

Published on Thu, 09/14/2023 - 18:34

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 12 రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్, స్పెయిన్‌కు వెళ్లారు.  ప్రస్తుతం స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో​ పర్యటిస్తున్నారు. తాజాగా అక్క‌డ ఆమె జాగింగ్ చేస్తూ క‌నిపించారు. చీర క‌ట్టులో.. స్మార్ట్‌ వాచ్‌ ధరించి, రబ్బరు చెప్పులు వేసుకుని మ‌రీ.. మాడ్రిడ్ పార్క్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ జాగింగ్ చేశారు.  దీదీతో పాటు ఆ దేశానికి వెళ్లిన బృందం కూడా జాగింగ్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియోను ఆమె త‌న ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ‘మార్నింగ్‌ రిఫ్రెష్. ఉద‌య‌మే జాగింగ్ చేస్తే రోజుకు కావాల్సిన శ‌క్తి వ‌స్తుంది. అందరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండండి’ అంటూ ఆమె ఆ పోస్టుకు కామెంట్ కూడా చేశారు. కాగా సాధార‌ణంగా ప్ర‌తి రోజూ ట్రెడ్‌మిల్‌పై జాగ్ చేస్తుంటారు. గతంలోనూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ..  వివిధ సందర్భాల్లో చెప్పుకొస్తూ ఉంటారు.

ఓసారి ఆమె డార్జిలింగ్‌ కొండల్లో 10 కిలోమీటర్లు జాగింగ్‌ చేసి ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. 12 రోజుల పాటు దుబాయ్‌, స్పెయిన్‌ పర్యటనకు వెళ్లిన దీదీ ప్రముఖ స్పానిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ అయిన లా లిగా అధ్యక్షుడితో చర్చలు జరపనున్నట్లు సమాచారం. లా లిగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్‌లో ఒకటి.
చదవండి: జోరు వానలో ల్యాండింగ్‌.. ముంబైలో విమాన ప్రమాదం

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)