Breaking News

ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్‌: కమలా హారీస్‌ కాదు.. ఓన్లీ ‘కమల’

Published on Fri, 08/16/2024 - 21:24

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎన్నికల్లో ఓటర్లు ఆకర్షించేందుకు డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారీస్‌ కొత్త ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పేరులోని ‘కమల’ అనే పదాలను మాత్రమే వాడుతున్నారు. ‘కమల’ అనే పిలవాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. 

కాగా, ఎన్నికల సమయంలో ఓటర్లతో మంచి సంబంధాన్ని పెంపొందించడానికి ప్రచారంలో ఆమె మొదటి పేరు ‘కమలా’ను స్వీకరించారు. మాజీ అధ్యక్షడు బరాక్‌ ఒబామా, పలువురు నేతల సూచనల మేరకు కమలా హారీస్‌ తన పేరును ‘కమల’గా మార్చుకుని ముందుకు సాగుతున్నారు. ఇక, డెమోక్రటిక్‌ మద్దతుదారులు కూడా ఆమెను కమలా.. కమలా అని నినాదాలు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు కమలా అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. కమలా అంటే ఆమె తల్లి పెట్టిన సాంస్కృతిక మరియు జాతి పేరు. 

ఇదిలా ఉండగా.. కమలా హారీస్‌ను డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించిన 48 గంటల్లో పార్టీ ప్రచార సోషల్ మీడియాను 'బిడెన్ హెచ్‌క్యూ' నుండి 'కమలా హెచ్‌క్యూ'కి త్వరగా రీబ్రాండ్ చేసింది. 'హారీస్' నుండి 'కమల'కి మారడం ద్వారా తన ప్రచారంలో ఓటర్లకు దగ్గర కావడానికి ప్లాన్‌ చేసుకున్నారు. మరోవైపు.. డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఆమె పలుమారు కమలా అని సంబోంధించడంతో ఈజీగా ఆ పేరు ప్రజల్లోకి వెళ్తుందనే కారణంగానే ఇలా ఫిక్స్‌ చేసినట్టు సమాచారం.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)