Breaking News

కరెంటు లేదు.. ఆహారం దొరకదు

Published on Mon, 01/05/2026 - 04:45

కరాకస్‌: వెనెజువెలా రాజధాని కరాకస్‌తోపాటు సమీప నగరాలు, పట్టణాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అమెరికా సైన్యం వైమానిక దాడులకు పాల్పడడం, అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసి విదేశానికి తరలించడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సూపర్‌ మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. ఆహారం, నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 అమెరికా దాడుల్లో విద్యుత్‌ గ్రిడ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. మళ్లీ విద్యుత్‌ సరఫరా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అధికారులు చేతులెత్తేశారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు పనిచేయడం లేదు. రాత్రయితే అంధకారంలో జీవించాల్సి వస్తోంది. వీధులు నిర్మానుష్యంగా మారాయి. కొన్నిచోట్ల సరకులు, మందుల దుకాణాలు  తెరవడంతో ఆహారం, ఔషధాల కోసం జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా అనిశ్చితి, భయాందోళన కనిపించాయి. 

ప్రజా రవాణా వ్యవస్థ సేవలను రద్దు చేశారు. జన జీవనం స్తంభించింది. విద్యుత్‌ సదుపాయం ఉన్నచోట సెల్‌ఫోన్లను చార్జింగ్‌ చేసుకొనేందుకు జనం ఎగబడుతున్న దృశ్యాలు కనిపించాయి. చార్జింగ్‌ కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని, అంతటా గందరగోళం నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరాకస్‌లో నివసిస్తున్న భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసింది. వారి సూచనలు జారీ చేస్తోంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. నిత్యం రాత్రి, పగలు జనంతో కిటకిటలాడే రాజధాని కరాకస్‌ సిటీలో ఆదివారం నిశ్శబ్దం, గందరగోళం రాజ్యమేలాయి.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)