Breaking News

నా పిల్లలు.. మోదీ తాతను మిస్‌ అవుతున్నారు: ఉషా వాన్స్‌

Published on Tue, 06/03/2025 - 11:39

వాషింగ్టన్‌ : తన పిల్లలు వాళ్ల మోదీ ( భారత ప్రధాని న‌రేంద్ర‌ మోదీ) తాతను మరిచిపోలేకపోతున్నారని, మిస్‌ అవుతున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (JD Vance) సతీమణి ఉషా వాన్స్‌ (Usha Vance) గుర్తు చేశారు.   

జేడీ వాన్స్‌ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో భారత్‌లో పర్యటించారు. భారత పర్యటన సంద‌ర్భంగా ప్రధాని మోదీ తమ పట్ల వ్యక్తిగతంగా చూపించిన ప్రేమ, ఆప్యాయతను మరిచిపోలేమంటూ.. ఉషా వాన్స్‌ అన్నారు. మరోసారి భారత్‌లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన ఆమె.. ఈ సారి తన మూలాలున్న ప్రాంతాల్లో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలిపారు.


అమెరికా వాషింగ్టన్‌ డీసీలో యూఎస్‌- ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరంలో ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భారత్‌ పర్యటన అనుభూతిని పంచుకున్నారు. కుమారులు ఇవాన్‌, వివేక్‌ కుమార్తె మీరాబెల్‌లు భారత్‌ పర్యటనను పదే పదే ప్రస్తావిస్తున్నార‌ని.. భారత‌ సంస్కృతి, సంప్రదాయాలు, రామాయణం గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నట్లు తెలిపారు.    

'నా పిల్లలు భారత పర్యటనలో ఉండగా ప్రధాని మోదీని తమ తాత లాగా భావించారు. ముఖ్యంగా నా కుమారుడు మోదీ నివాసంలో మామిడి పండ్లన్నింటినీ తీసుకున్నాడు. తనకు అక్కడే ఉండిపోవాలని ఉందని' అతడు పేర్కొన్నట్లు వెల్లడించారు. తన‌ ఐదేళ్ల కుమార్తె మీరాబెల్‌ పుట్టిన రోజుకు ప్ర‌త్యేక‌ బహుమతి ఇచ్చిన న‌రేంద్ర మోదీ త‌మ‌ గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నార‌ని అన్నారు. మరోసారి భారత్‌లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కానీ, ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాల్లోనూ తాను పర్యటిస్తానన్నారు.

ప్రధాని మోదీతో భేటీపై ఉషా వాన్స్ కీలక వ్యాఖ్యలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)