Breaking News

USA Presidential Elections 2024: కమలా హారిస్‌దే పైచేయి

Published on Thu, 08/15/2024 - 04:39

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రాటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌దే పైచేయిగా ఉందని తాజాగా వెల్లడైంది. డెసిషన్‌ డెస్క్‌ హెచ్‌క్యూ– ది హిల్‌ కూర్చిన పోల్‌ ఆఫ్‌ ది పోల్స్‌లో దేశవ్యాప్తంగా డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే హారిస్‌ 4.2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. 45 పోల్స్‌ను క్రోడీకరించి ఫలితాలను వెల్లడించారు. కమలా హారిస్‌ ఏకంగా 4.2 శాతం ఆధిక్యంలో ఉండగా, మే తర్వాత ఆమె ఏకంగా పది శాతం పుంజుకోవడం విశేషం.

 హోరాహోరీ పోరు నెలకొన్న ఏడు రాష్ట్రాల్లో ఆరింటిలో ట్రంప్‌పై హారిస్‌ ఒకశాతం ఆధిక్యంలో ఉన్నారని బెనెన్‌సన్‌ స్ట్రాటజీ గ్రూపు– జీఎస్‌ స్ట్రాటజీ గ్రూపు సర్వే వెల్లడించింది. హోరాహోరీ రాష్ట్రాలైన జార్జియా, మిషిగాన్, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, అరిజోనాల్లో హారిస్‌కు ఒక శాతం ఆధిక్యం ఉంది. నెవెడాలో మాత్రం ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. నెవెడాలోనూ హారిస్‌ క్రమేపీ పుంజుకుంటున్నారు. 

మే నుంచి తీసుకుంటే ట్రంప్‌తో వ్యత్యాసాన్ని ఆరు పాయింట్ల మేరకు తగ్గించారు. ట్రంప్‌తో పోలిస్తే కమలా హారిస్‌ నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన నాయకురాలని అమెరికన్లు భావిస్తున్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌– ఎన్‌ఓఆర్‌సీ సర్వే తెలిపింది. ఆర్థిక వ్యవస్థ, వలసల అంశాల్లో ట్రంప్‌ మెరుగని భావిస్తున్నారు. అధ్యక్ష రేసులోకి లేటుగా వచ్చినా హారిస్‌ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 10న ట్రంప్‌తో ఆమె డిబేట్‌ పోటాపోటీగా ఉంటుందని భావిస్తున్నారు. అందరి దృష్టీ దానిపైనే నెలకొంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి