దేవుడు తప్ప నన్నెవరూ... తప్పించలేరు: బైడెన్‌

Published on Sun, 07/07/2024 - 04:21

వాషింగ్టన్‌: తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (81) కొట్టిపారేశారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని దేవుడు తప్ప తననెవరూ ఒప్పించలేరని ఏబీసీ ఛానల్‌ ఇంటర్వ్యూలో అన్నారు. గత వారం రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చలో బైడెన్‌ పదేపదే తడబటడం, ఆగి ఆగి మాట్లాడటంతో ఆయన మానసిక సంతులతపై డెమొక్రాట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. బైడెన్‌ వైదొలగాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

సర్వేల్లోనూ ఆయనకు ప్రజాదరణ పడిపోయింది. విరాళాలు ఇచ్చే దాతలు కూడా బైడెన్‌ తప్పుకుంటేనే తమ ఆర్థిక సహకారం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఒత్తిళ్లు పెరుగుతున్నా బైడెన్‌ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. ప్రపంచాన్ని నడుపుతున్నానని, అధ్యక్షుడిగా ఉండటానికి తనకంటే మరెవరికీ యోగ్యత లేదన్నారు. మెదడు పనితీరుపై పరీక్ష చేయించుకొని ఫలితాలను ప్రజల ముందు పెడతారా అని ప్రశ్నించగా తాను రోజూ పరీక్ష ఎదుర్కొంటున్నానని బదులిచ్చారు.

మూడున్నరేళ్ల పాలనలో తాను ఎన్నో విజయాలు సాధించాననీ, అవి ట్రంప్‌తో గంటన్నర పాటు జరిపిన చర్చ వల్ల వమ్ము కావన్నారు. కొవిడ్‌ నుంచి అమెరికాను గట్టెక్కించి ప్రపంచంలోనే అత్యంత బలీయ ఆర్థిక వ్యవస్థగా నిలిపానని బైడెన్‌ తెలిపారు. తన ముదిమి వయసు గురించి చాలా చర్చ జరుగుతోందనీ, కోటిన్నర కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి తన వయసు అడ్డురాలేదని పేర్కొన్నారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)